Ratan Tata Birthday: ఓపికతో తీర్చిద్దిన వ్యాపారం టాటా గ్రూప్.. ఇది రతన్ టాటా ప్రయాణం.. ఓపికతో వ్యవహరిస్తే విజయం ఖాయం.. ఈ సూత్రంతో భారత వ్యాపార రంగంలో దిగ్విజయంగా దూసుకు పోతున్నారు రతన్ టాటా. ఈరోజు(డిసెంబర్ 28) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 28 Dec 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ratan Tata Birthday: ఓపికగా ఉండండి.. విజయం మీదే! ఇదే మన దేశ అత్యున్నత వ్యాపార సామ్రాజ్య అధినేత రతన్ టాటా చెప్పే సూత్రం. దీనినే ఆయన నమ్మరు. ఈ సూత్రం పునాదిగానే ఆయన ఎవరికీ సాధ్యం కానీ వ్యాపార విజయాలు సాధించారు. ఈరోజు (డిసెంబర్ 28) రతన్ టాటా పుట్టినరోజు. ఈ సందర్భంగా వారసత్వంగా తనకు వచ్చిన టాటా సామ్రాజ్యాన్ని ఏరకంగా ముందుకు తీసుకువెళ్లారు? ఇప్పుడు టాటా గ్రూప్ భారత వ్యాపార రంగంలో ఎంత బలంగా నిలిచిందో తెలుసుకుందాం. కాదన్న కంపెనీనే కొనేసి.. ఇది 1998 నాటి మాట. టాటా తన మొట్టమొదటి కారు టాటా ఇండికా మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది రతన్ టాటా(Ratan Tata Birthday) ట్రీమ్ ప్రాజెక్ట్ లలో ఒకటి. అయితే, ఈ కారు అంతగా విజయవంతం కాలేదు. ఒక సంవత్సరం పాటు ఆ ప్రాజెక్ట్ నిలబెట్టుకోవాలని విపరీతమైన ప్రయ్నత్నాలు చేసింది టాటా. దీనికోసం 1999 లో అమెరికాకి చెందిన అప్పట్లో అతి పెద్ద కార్ల కంపెనీ ఫోర్డ్ సహాయం కోరింది. అయితే, ఫోర్డ్ కంపెనీ అధినేత బిల్ అది సాధ్యం కాదని చెప్పారు. అదీకాకుండా.. టాటాలకు పాసింజర్ కార్ల విషయంలో తాము జటగట్టగలిగేంత అనుభవం కానీ, జ్ఞానం కానీ లేవని చెప్పారు. కట్ చేస్తే.. సరిగ్గా తొమ్మిదేళ్లు తిరిగేసరికి అంటే 2008 నాటికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఫోర్డ్ దివాళా అంచుకు చేరుకుంది. ఈ పరిస్థితిలో ఫోర్డ్ కంపెనీ టాటా తలుపు తట్టింది. అప్పుడు రతన్ టాటా ఫోర్డ్ రెండు పాప్యులర్ బ్రాండ్స్ ల్యాండ్ రోవర్, జాగ్వర్ లను 2.3 బిలియన్ డాలర్స్ కి కొనేసారు. ఆ మొతం ఇప్పటి లెక్కలో చూస్తే 19 వేళా కోట్ల రూపాయలు. వర్షంలో స్కూటర్ పై తడుస్తూ వెళుతున్న కుటుంబాన్ని చూసి.. ఒకసారి రతన్ టాటా(Ratan Tata Birthday) ముంబయి లో భారీ వర్షంలో టూ వీలర్ పై తుడుచుకుంటూ వెళుతున్న నలుగురు సభ్యుల కుటుంబాన్ని చూశారు. అది చూసిన తరువాత ఆయనకు వచ్చిన పెద్ద ఆలోచన మధ్యతరగతి వారికీ అందుబాటులో ఉండేలా కారును తీసుకురావాలని. అదే.. టాటా నానో కారు. ఆ సంఘటన తరువాత ఆయన 2008 లో తన ఇంజనీరల్ను లక్ష రూపాయల కారు కావాలని చెప్పారు. అప్పటివరకూ భారతీయ కార్ల చరిత్రలో అంత తక్కువ ఖరీదులో వచ్చిన కారు అదే. నాలుగు సార్లు ప్రేమలో.. ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా(Ratan Tata Birthday) తన పెళ్లి గురించి చాలా ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన నాలుగు సార్లు ప్రేమలో పడ్డారు. నాలుగు సార్లూ ఆ ప్రేమకథలు పెళ్లి వరకూ వెళ్లాయి. కానీ, చివరలో అవి ఫెయిల్ అయ్యాయి. ఈ నాలుగు ప్రేమ కథల్లో ఒకటి మాత్రం కచ్చితంగా పెళ్లి జరగాల్సిందే. అమెరికాకు చెందిన ఒక అమ్మాయిని రతన్ టాటా ప్రేమించారు. వారి పెళ్లి కూడా ఖాయం అయిపొయింది. అది 1962లో. సరిగ్గా ఆసమయంలో భారత్ చైనా దేశాల మధయ్ యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. దీంతో ఆ అమ్మాయి.. భారత్ రావడానికి ఇష్టపడలేదు. దీంతో రతన్ టాటా భారత్ వచ్చేశారు. తరువాత ఆయన బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఆ అమెరికా అమ్మాయి మాత్రం అక్కడే ఎవరినో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. Also Read: అరటి పండే అని తీసిపారేయకండి.. ఎగుమతుల మార్కెట్లో దాని విలువే వేరు! ఇక ప్రస్తుతానికి వస్తే రతన్ టాటా(Ratan Tata Birthday) సారధ్యంలోని టాటా గ్రూప్ 2023 సంవత్సరంలో దలాల్ స్ట్రీట్‌లో పెట్టుబడిదారులను ధనవంతులను చేయడం కొనసాగించింది. గ్రూప్‌లోని 27 కంపెనీల జాయింట్ మార్కెట్ క్యాప్‌లో దాదాపు రూ.613,000 కోట్లు పెరిగాయి. విశేషమేమిటంటే గ్రూప్‌లోని మూడు కంపెనీలు ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించాయి. ఒక కంపెనీ 218 శాతం రాబడిని ఇచ్చింది. మరోవైపు టాటా టెక్ ఐపీఓ కూడా ఇన్వెస్టర్లను సంతోషపెట్టింది. టాటా టెక్నాలజీస్ ఐపీఓకు రికార్డు స్థాయి స్పందన లభించింది. రూ. 3,042 కోట్ల IPO రూ. 1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ బిడ్‌లను అందుకుంది మరియు 140 శాతం ప్రీమియంతో జాబితా చేయబడింది. టాటా టెక్‌ను మినహాయించి, టాటా బాస్కెట్‌లోని మూడు మల్టీబ్యాగర్‌లు - బనారస్ హోటల్స్ (218 శాతం), ఆర్టెసన్ ఇంజనీరింగ్ (144 శాతం), ట్రెంట్ (119 శాతం) రిటర్న్‌లు ఇచ్చాయి. Watch this interesting Video: #tata-group #ratan-tata మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి