రష్మికను టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. మరో డీప్ ఫేక్ వీడియో వైరల్! నేషనల్ క్రష్ రష్మికను టార్గెట్ చేశారు కేటుగాళ్లు. తాజాగా, మరో డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లుగా సృష్టించారు. By Jyoshna Sappogula 10 Nov 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rashmika Mandanna: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఒరిజినల్ వీడియో లాగా ఫేక్ వీడియోలను (Fake Videos) క్రియేట్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక (Rashmika Mandanna) ఫేస్ ను యాడ్ చేసి ఓ వీడియోను క్రియేట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ ప్రతి ఒక్కరూ డీప్ ఫేక్ వీడియోను ఖండించారు. Also Read: వ్యూహం సినిమాను అందుకే ఏపీ ఫైబర్ లో రిలీజ్ చేస్తున్నాం.! అంతే కాదు, నటి రష్మిక వీడియో వెలుగులోకి వచ్చిన నెక్స్ట్ డే నే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) డీప్ ఫేక్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ చేశారు. ‘టైగర్ 3’ సినిమాలోని టవల్ ఫైట్ ఫోటోను తీసుకుని, లో దుస్తుల్లో ఉన్నట్లు మార్ఫింగ్ చేశారు. ఇలా వరుసగా ఫేక్ వీడియోలు సిని సెలబ్రేటిలను కలవరపెడుతున్న తరుణంలోనే రష్మికకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. Another Deep Fake Video of Rashmika Mandanna viral on Instagram, Youtube and Facebook.#Deepfake #RashmikaMandanna pic.twitter.com/JBWT2C8Xyi — Mr Reaction Wala (@MrReactionWala) November 9, 2023 తాజాగా మరో డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు. ఈ వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. దీంతో ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మికను కావాలని కొందరు టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇలాంటివి క్రియేట్ చేసే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని, ఎవరూ నమ్మకూడదని పోస్టులు పెడుతున్నారు. #rashmika-mandanna #heroine-rashmika #rashmika-mandanna-recent-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి