Rashmika Mandana: పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ అదిరిపోయిందిగా..!

అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప 2. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో రష్మిక గ్రీన్ శారీలో భారీ నగలు ధరించి మెస్మరైజ్ చేస్తోంది.

New Update
Rashmika Mandana: పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ అదిరిపోయిందిగా..!

Rashmika Mandana: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప 2. పుష్ప పార్ట్ 1 విజయంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ అనౌన్స్ మెంట్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్

నేడు హీరోయిన్ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 లోని శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో.. ఆకుపచ్చని రంగు చీరలో .. ఒంటి నిండా నగలు, తల పై సింధూరం ధరించిన రష్మిక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

publive-image

'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ పోస్టర్

ప్రస్తుతం పుష్ప 2 తో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు నటి రష్మిక. వాటిలో ఒకటి 'ది గర్ల్ ఫ్రెండ్'. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో కాలేజీ అమ్మాయిలా కనిపిస్తున్న రష్మిక లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

publive-image

Also Read: Brahmamudi Serial: అప్పు కోసం రోడ్డెక్కిన కళ్యాణ్..! కోపంతో రగిలిపోతున్న అనామిక, ధాన్యలక్ష్మి.. కావ్య కుటుంబానికి అవమానం

Advertisment
Advertisment
తాజా కథనాలు