Rashmi Gautam: ఫ్రెండ్స్‌తో రచ్చ రచ్చ చేస్తోన్న రష్మి.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాముళ్లగా లేవుగా..!

ఫ్రెండ్స్‌తో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను షురూ చేసింది జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి

New Update
Rashmi Gautam: ఫ్రెండ్స్‌తో రచ్చ రచ్చ చేస్తోన్న రష్మి.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాముళ్లగా లేవుగా..!

Rashmi Gautam: రష్మి గౌతమ్(Rashmi Gautam) బుల్లితెరపై ఎంత సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీషో ద్వారా బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలియింగ్ తోపాటు పాపులారిటి సంపాధించుకుంది. తాజాగా, తన ఫ్రెండ్స్‌తో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను షురూ చేసింది ఈ సుందరి. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

publive-image

వచ్చి రాని తెలుగు బాషతో క్యూట్ గా మాట్లాడుతూ అందరిని నవ్విస్తు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తునే మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతుంది. అంతేకాదు ప్రతి పండుగకు ఏదో ఒక ఈవెంట్ లో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ అందాల భామ. ఒక్కో షోకి దాదాపు రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.

ఇదిలా ఉంటే, రష్మి త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు నెట్టింట్లో నెటిజన్లు హల్ చల్ చేస్తున్నారు. ఒడిషాకు చెందిన ఓ యువ వ్యాపారీని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలో ఇందుకు సంబంధించి రష్మి ప్రకటించనున్నట్లు సమాచారం.

publive-image

ఇక ఈ వార్త చూసిన సుధీర్ ప్యాన్స్ మాత్రం అయ్యో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. సుధీర్, రష్మీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని  ఎప్పటినుంచో ఓ రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.

publive-image

Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ..ఏం మాట్లాడుకున్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు