Rashid Khan: రికార్డ్ సృష్టించిన ఆఫ్గాన్ బౌలర్!

రీ ఎంట్రీలో ఆఫ్గాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ రికార్డ్ సృష్టించాడు. టీ 20 లో అత్యుత్తమ గణాంకాలు కలిగిన కెప్టెన్ గా రషీద్ చరిత్ర సృష్టించాడు.

New Update
Rashid Khan: రికార్డ్ సృష్టించిన ఆఫ్గాన్ బౌలర్!

రీ ఎంట్రీలో ఆఫ్గాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ రికార్డ్ సృష్టించాడు. టీ 20 లో అత్యుత్తమ గణాంకాలు కలిగిన కెప్టెన్ గా రషీద్ చరిత్ర సృష్టించాడు.

ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన రషీద్ ఖాన్ ఆరంభ మ్యాచ్ ను ఘనంగా చాటుకున్నాడు. గత కొంత కాలంగా గాయం కారణంతో  క్రికెట్ కు దూరంగా  రషీద్ ఖాన్ ఉన్నాడు. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ తో మైదానంలో కి అడుగు పెట్టాడు.  ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన రషీద్.. 3 వికెట్లు తీసీ 19 పరుగులు ఇచ్చాడు. ఐర్లాండ్ కీలక ఆటగాళ్లు పాల్ స్టిర్లింగ్,క్యాంప్ హెర్లింగ్ వంటి కీలక బ్యాట్స్ మెన్ల వికెట్లను రషీద్ పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. టీ20 ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆఫ్గాన్ కెప్టెన్ గా నిలిచాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు ఆఫ్గాన్ మాజీ కెప్టెన్ నవరోజ్ మంగోల్ పేరిట ఉంది. 2014 లో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై మంగల్ నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీసి 23 పరుగులు ఇచ్చాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆ రికార్డ్ ను రషీద్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ కు ముందు పూర్తి ఫిట్నెస్ తో రషీద్ ఉండటం గుజరాత్ టైటాన్స్ కు కలసి వచ్చే అంశం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై కారు లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
warangal Road Accident

warangal Road Accident

TG Crime: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై కారు లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

( ts-crime | ts-crime-news | latest-news )

Advertisment
Advertisment
Advertisment