Prasanth Varma : రణ్ వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి అదిరిపోయే టైటిల్! ప్రశాంత్ వర్మ - రణ్ వీర్ సింగ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి 'బ్రహ్మ రాక్షస' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారట. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని తెరకెక్కించనున్నారని, అన్ని భాషల్లో ఇదే టైటిల్ ని లాక్ చేసినట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. By Anil Kumar 13 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Prasanth Varma - Ranveer Singh Movie Tittle : 'హనుమాన్' మూవీతో పాన్ ఐడియా లెవెల్లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ముఖ్యంగా ఇతని ఫిల్మ్ మేకింగ్ కి నార్త్ వాళ్ళు ఫిదా అయిపోయారు. 'హనుమాన్' చూసిన కొందరు బాలీవుడ్ స్టార్స్ ఎలాగైనా ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.ప్రశాంత్ వర్మ రణ్ వీర్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందట. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్ ని కూడా లాక్ చేసినట్లు తెలిసింది. Also Read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగచైతన్య తల్లి.. ఫోటో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! రణ్ వీర్ తో 'బ్రహ్మ రాక్షస' ప్రశాంత్ వర్మ - రణ్ వీర్ సింగ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి 'బ్రహ్మ రాక్షస' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారట. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని తెరకెక్కించనున్నారని, అన్ని భాషల్లో ఇదే టైటిల్ ని లాక్ చేసినట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అంతేకాదు హనుమాన్ మూవీ తరహాలోనే సూపర్ హీరో కథాంశంతో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్ తో ఈ మూవీని రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'జై హనుమాన్' పై ఫోకస్ పెట్టిన ప్రశాంత్ వర్మ.. ఈ మూవీని పూర్తి చేసిన తర్వాతే రణ్ వీర్ సింగ్ తో సినిమాని పట్టాలెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. #prasanth-varma #ranveer-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి