Ramayana : 'రామాయణ' సెట్స్ నుంచి రన్ బీర్, సాయి పల్లవి లుక్స్ లీక్.. నెట్టింట వైరల్

'రామాయణం' సెట్స్ నుండి రన్ బీర్, సాయి పల్లవి పిక్స్ బయటికి వచ్చాయి. రాముడిగా రన్ బీర్, సీతగా సాయి పల్లవి లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.

New Update
Ramayana : 'రామాయణ' సెట్స్ నుంచి రన్ బీర్, సాయి పల్లవి లుక్స్ లీక్.. నెట్టింట వైరల్

Ranbir Kapoor, Sai Pallavi : బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణం' షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా సెట్స్ నుండి రన్ బీర్, సాయి పల్లవి పిక్స్ బయటికి వచ్చాయి. రాముడిగా రన్ బీర్, సీతగా సాయి పల్లవి లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా సాయి పల్లవిని సీత గెటప్ లో చూసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

ఈ పిక్స్ తో ఒక్కసారిగా రామాయణ ప్రాజెక్ట్ పై సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలైపోయాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలకు దాదాపు మంచి ప్రేక్షకాదరణే దక్కింది. ఒక్క 'ఆదిపురుష్' సినిమా మాత్రమే డిసప్పాయింట్ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడమే కాకుండా తీవ్ర విమర్శల పాలైంది. ముఖ్యంగా VFX, గ్రాఫిక్స్ విషయంలో మూవీ టీమ్ పై భారీ ట్రోలింగ్ జరిగింది.

ఇప్పుడు మరోసారి అదే బాలీవుడ్ నుండి 'రామాయణ' ప్రాజెక్ట్ తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే ఈసారి 'ఆదిపురుష్' విషయంలో జరిగిన తప్పులని రీపీట్ చేయకుండా కాస్టింగ్ నుంచి టెక్నీకల్ వర్క్స్ వరకు ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో 'KGF' హీరో యష్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఏకంగా 15 కేజీల బరువు కూడా పెరగబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించనున్న ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Also Read : రౌడీ హీరో ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో అవేం ఉండవట?

Advertisment
Advertisment
తాజా కథనాలు