Ramoji Rao: రామోజీరావు ఇక లేరు

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

New Update
Ramoji Rao: రామోజీరావు ఇక లేరు

Ramoji Rao Passes Away: రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు. ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం ఉదయం 4. 50 గంటలకు కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.

రామోజీరావు కృష్ణాజిల్లా పెదపారుపూడి 1936 నవంబర్ 18న జన్మించారు. ఈయన నాన్నగారు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి కెంటక సుబ్బారావు. రామోజీరావు స్థాపించిన కామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది.


కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో..

ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్న ఆయన గతంలోనూ అనారోగ్యంతో బాధపడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక ఈనాడు గ్రూప్కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని అయిన రామోజీరావు.. 60కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దశాబ్దాల తరబడి తెలుగు రాజకీయాలపై తనదైన శైలిలో ప్రభావం చూపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు