PM Modi : మోదీ కేబినెట్‌ లో అతి చిన్న వయస్సున్న ఎంపీ తెలుగువాడే!

మోదీ కేబినెట్‌ లో ఈసారి కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయసున్న వ్యక్తి ఏపీకి చెందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్‌ నాయుడు కాగా, హెచ్‌ఏఎం నేత జీతన్‌ రాం మాంఝీ అత్యంత వృద్దునిగా ఉన్నారు.

New Update
PM Modi : మోదీ కేబినెట్‌ లో అతి చిన్న వయస్సున్న ఎంపీ తెలుగువాడే!

Modi Cabinet : భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి.. తన కేబినెట్‌ లో కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త కేబినెట్లోకి ఈసారి కొత్త మంత్రులు చాలామందే ఉన్నారు. అయితే వారిలో అత్యంత పిన్న వయస్సున్న మంత్రి ఉన్నాడు.. అత్యంత వృద్ద మంత్రి ఉన్నాడు.

కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల్లో అతి చిన్న వయసున్న మంత్రిగా మన తెలుగు వ్యక్తి ఏపీ (Andhra Pradesh) కి చెందిన కింజారపు రామ్మోహన్‌ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) ఉన్నాడు.. ఇదిలా ఉంటే అత్యంత వృద్ద నేతగా జీతన్‌ రామ్‌ మాంఝీ మోదీ మంత్రి వర్గంలో ఉన్నారు. 36 సంవత్సరాల రామ్మోహన్‌ శ్రీకాకుళం నుంచి వరుసగా మూడో సారి ఎంపీగా విజయం సాధించారు.

తన ప్రత్యర్థి , వైసీపీ అభ్యర్థి తిలక్‌ పేరాడ పై సుమారు 3.27 లక్షల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే మరో యువనేత... 37ఏళ్ల రక్షా ఖడ్సే మహారాష్ట్రలోని రేవర్ స్థానం నుంచి గెలిచారు. ఇదిలా ఉంటే ప్రమాణం చేసిన వారిలో అత్యంత వృద్ధనేత జీతన్ రామ్ మాంఝీ (79). ఆయన బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2015లో ఆయన హిందుస్తానీ అవామీ మోర్చా పార్టీని స్థాపించరు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గయ నుంచి గెలిచారు.

Also read: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా రామ్‌చరణ్

Advertisment
Advertisment
తాజా కథనాలు