Game Changer Movie : పండగ పూట మెగా ట్రీట్..'గేమ్ ఛేంజర్' నుంచి సెకండ్ సింగిల్

'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నేడు వినాయక చవితి సందర్భంగా మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. సినిమా నుంచి ఈ నెలలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. చెర్రీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్‌ కూడా రిలీజ్ చేశారు.

New Update
Game Changer Movie : పండగ పూట మెగా ట్రీట్..'గేమ్ ఛేంజర్' నుంచి సెకండ్ సింగిల్

Game Changer Movie : పండగ పూట 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నిన్న తమన్ చెప్పినట్లే నేడు వినాయక చవితి సందర్భంగా మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. సినిమా నుంచి ఈ నెలలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చెర్రీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఓ లుక్‌ని కూడా విడుదల చేశారు.

ఇందులో చరణ్ తలకి ఎర్ర కండువా కట్టుకుని మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ ను బట్టి చూస్తే రాబోయే సెకండ్ సింగిల్ మాస్ సాంగ్ అని అర్థమవుతోంది. అంతేకాదు చెర్రీ మాస్ సాంగ్ పై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Also Read : మోక్షజ్ఞ మూవీలో ఎన్టీఆర్ స్పెషల్ రోల్.. ఫ్యాన్స్ కు పూనకాలు గ్యారెంటీ

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది. అగ్ర నిర్మాత దిల్ రాజ్ సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు