/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-16T092835.665-jpg.webp)
Ram Charan : రామ్ చరణ్(Ram Charan) - ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబోలో తెరెకెక్కబోతున్న చిత్రం RC 16. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇక సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'RC 16' సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా అఫీషియల్ టైటిల్, ముహూర్తం డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
Also Read : Mamitha Baiju: నయా క్రష్.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?
'పెద్ది ' టైటిల్ లో రామ్ చరణ్
RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమాను ఈ నెల 20న పూజ కార్యకమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. రామ్ చరణ్- బుచ్చి బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు 'పెద్ది'(Peddi) అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరలవుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా .. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ 'గేమ్ చేంజర్' మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తవగానే RC16 షూట్ లో పాల్గొంటారని సమాచారం.
A call out by director @BuchiBabuSana to all the aspiring actors to be a part of the MASSive #RC16 ❤️🔥❤️🔥
We begin our talent hunt in Uttarandhra 🎬
Email ID to reach out to in case of any clarifications : rc16casting@vriddhicinemas.com #RamCharanRevolts
Global Star… pic.twitter.com/ZnOfR31url— Vriddhi Cinemas (@vriddhicinemas) February 7, 2024
Also Read : Surekha Vani : ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి