Ram Charan : సినిమా ప్లాప్ అయితే పార్టీ చేసుకుంటా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

రామ్ చరణ్ కు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో 'మీ తండ్రి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.." ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. సినిమా బాగా ఆడలేదంటే పార్టీ చేసుకుంటా" అని అన్నాడు.

New Update
Ram Charan : సినిమా ప్లాప్ అయితే పార్టీ చేసుకుంటా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

Ram Charan Latest Interview : టాలీవుడ్ కి మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక RRR మూవీతో చరణ్ క్రేజ్ ఎల్లలు దాటింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ ను ఆకట్టుకొని గ్లోబల్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈ మెగా హీరోకి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మీ తండ్రి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా?' అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు చరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

పార్టీ చేసుకుంటా...

" ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. నా కెరీర్‌ విషయానికే వస్తే సినిమా ఫలితాల గురించి మరీ అంత ఒత్తిడిగా ఫీలవను. చెప్పాలంటే ఏదైనా సినిమా బాగా ఆడలేదంటే రిలాక్స్‌ అయ్యేందుకు పార్టీ చేసుకుంటాను. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ అయినప్పుడు వారం రోజుల దాకా ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేదు. నా కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్‌ చేశాను" అని అన్నాడు.

Also Read : నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు, నటుడిగా ఎన్నడూ ఫెయిల్‌ అవలేదు.. వితిక ఎమోషనల్ కామెంట్స్!

అంతేకాకుండా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ల గురించి అంతగా ఆలోచించనని, ఇప్పుడు ఏం చేస్తున్నాననేదే నమ్ముతానని, రేపటి గురించి ఆందోళన చెందను' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చరణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' (Game Changer) షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటూ బుచ్చిబాబు తో ఓ సినిమా అలాగే సుకుమార్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు