Rakul Preet Singh: ‘రామాయణం‘లో శూర్పణఖగా రకుల్..సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న బ్యూటీ..!!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణకగా కనిపించనుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా రామాయణంలో రకుల్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

New Update
Rakul Preet Singh: ‘రామాయణం‘లో శూర్పణఖగా రకుల్..సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న బ్యూటీ..!!

Rakul Preet Singh: బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న మూవీ రామాయణం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయిపల్లవి సీతారాముడిగా ఈ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీ తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా మూవీ మేకర్స్ శరవేగంగా నిర్మాణ పనులుకొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్, హనుమాన్ గా సన్నీడియోల్ కనిపించబోతున్నట్లు సమాచారం. కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారని టాక్.

రామాయణంలో రకుల్:
తాజాగా రామాయణం సినిమాకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన శూర్పణఖ పాత్రను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సెట్ అవుతుందని నితిష్ తివారీ భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీస్టాఫ్ రకుల్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రామాయణంలో శూర్పణఖ పాత్ర కోసం రకుల్ నితీష్ తివారీ కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారట. ఈ పాత్రలో నటించేందుకు రకుల్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రామాయణంలో రావణుడితో పాటు శూర్పణఖ పాత్ర ఎంతో ముఖ్యమని బాలీవుడ్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.

ఇది కూడా చదవండి : వాహనదారులకు శుభవార్త..ఇక నుంచి ఫాస్టాగ్స్ ఉండవు..కేంద్రం కీలక నిర్ణయం..!!

కాగా ఈ మూవీలో శూర్పణఖ పాత్రకోసం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ లుక్ టెస్టులో పాల్గొన్నట్లు సమాచారం. అనుకున్న క్యారెక్టర్ కు రకుల్ చక్కగా సెట్ అయ్యిందని దర్శకుడు భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే పెళ్లితర్వాత రకుల్ నటించబోయే తొలి సినిమా రామాయణం అవుతుంది. 2025 దీపావళి కానుకగా రామాయణం తొలి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : అదే 23న.. చంద్రబాబుపై ఆర్జీవీ సంచలన ట్వీట్

Advertisment
Advertisment
తాజా కథనాలు