YCP: రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..!

వచ్చే నెల 8న రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు సీట్లను గెలుచుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు టీడీపీ కూడా వైసీపీ రెబల్స్‌ మద్దతుతో సీటు గెలుచుకోవాలనే ఆలోచన చేస్తోంది.

New Update
YCP: రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..!

Also Read: బీఆర్ఎస్ అక్రమాలపై యాక్షన్ ఎక్కడ? తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించిన రఘునందన్ రావు

ఈ మూడు సీట్లను గెలుచుకునేందుకు అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ (TDP) కూడా వైసీపీ రెబల్స్‌ మద్దతుతో సీటు గెలుచుకోవాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను రాజ్యసభకు పంపే ఛాన్స్‌ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పాయకరావుపుట, చిత్తూరు ఎమ్మెల్యేలను పెద్దల సభకు పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వనట్లు తెలుస్తోంది. టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అరణి శ్రీనివాసులు, గొల్లబాబురావు ను వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా  పంపాలని నిర్ణయం తీసుకుందని సమాచారం.

Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు అతి భారీ షాక్‌.. పదేళ్లు జైలుశిక్ష!

టీడీపీ నుంచి వర్ల రామయ్యను పోటీకి దింపే ఛాన్స్‌ కనిపిస్తోంది. గత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బలం లేకపోయినా వైసీపీ రెబల్స్‌ సహకారంతో ఓ ఎమ్మెల్సీ గెలుచుకుంది.అలాగే, రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లోనూ అభ్యర్థిని పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు