ఢిల్లీ సర్వీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఎన్డీఏ కూటమికి 131ఓట్లు సుదీర్ఘ చర్చ తర్వాత ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా బిల్లుకు మద్దతుగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. ఢిల్లీ సేవల బిల్లు ఏ విధంగానూ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించదంటూ కామెంట్స్ చేశారు అమిత్‌షా. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన లక్ష్యంగా రూపొందించన్నారు. INDIA కూటమిలో మరిన్ని పార్టీలు చేరినా పర్వాలేదని 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు అమిత్‌షా By Trinath 08 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి Rajya Sabha passes Delhi services Bill : ఢిల్లీ సర్వీసెస్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ సందర్భంగా బిల్లుకు మద్దతుగా 131 ఓట్లు.. వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. ఆటోమెటిక్ ఓటింగ్ మిషన్ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలున్న కారణంగా.. స్లిప్స్ ద్వారా ఈ ఓటింగ్‌ను నిర్వహించారు. ఇప్పటికే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ సర్వీసు బిల్లుపై రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రసంగం అగ్గి రాజేసింది. సర్వీసు బిల్లుపై ప్రసంగిస్తూ మధ్యలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) ప్రస్తావన తీసుకొచ్చారు అమిత్‌షా. ఈ స్కామ్ గురించి మట్లాడుతూ మధ్యలో బీఆర్‌ఎస్ పేరు ఎత్తారు. దీంతో సభలో ఉన్న హడావుడి నెలకొంది. అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ (BRS) ఎంపీలు స్లోగన్స్ మొదలుపెట్టారు. అటు అమిత్‌షా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. మద్యం కుంభకోణం ఫైళ్లు తమ వద్ద ఉండడంతోనే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం విజిలెన్స్ విభాగంలోని అధికారులను బదిలీ చేసిందని ఆరోపించారు అమిత్‌షా. ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడేందుకు సర్వీసు బిల్లును తీసుకొచ్చామన్నారు. మరోవైపు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi services Bill) ను సెలెక్ట్ కమిటీ ఆఫ్ హౌస్‌కి పంపడాన్ని రాజ్యసభ తిరస్కరించింది. ఢిల్లీ సర్వీసుల బిల్లును సెలెక్ట్ కమిటీ ఆఫ్ హౌస్‌కు వాయిస్ ఓటింగ్ ద్వారా పంపాలన్న విపక్షాల తీర్మానాన్ని రాజ్యసభ తిరస్కరించింది. షా షో..! ఢిల్లీ సర్వీసు బిల్లుపై ప్రసంగిస్తూనే విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు అమిత్‌షా. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు (Congress Party) లేదని మండిపడ్డారు. ఎమర్జెన్సీ విధించడానికి లేదా ప్రజల హక్కులను హరించడానికి ఢిల్లీ సర్వీస్ బిల్లు తీసుకురాలేదంటూ చురకలంటించారు. ఆమ్ ఆద్మీ పార్టీని (Aam Aadmi Party) ప్రసన్నం చేసుకునేందుకే ఢిల్లీ సర్వీసుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఢిల్లీకి చట్టాలను రూపొందించే అధికారాలను పార్లమెంటుకు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించిందన్న విషయం మరువద్దన్నారు అమిత్ షా. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదన్నారు అమిత్‌షా. 2015కి ముందు ఢిల్లీని బీజేపీ, కాంగ్రెస్‌లు పాలించాయని.. కానీ కేంద్రంతో ఎప్పుడూ గొడవలు లేవని ఆప్ టార్గెట్‌గా ఫైర్ అయ్యారు. ఢిల్లీ సేవల బిల్లు ఏ విధంగానూ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించదంటూ కామెంట్స్ చేశారు అమిత్‌షా. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన లక్ష్యంగా రూపొందించన్నారు. INDIA కూటమిలో మరిన్ని పార్టీలు చేరినా పర్వాలేదని 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు అమిత్‌షా. Also Read: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం #brs #delhi-liquor-scam #amit-shah #aam-aadmi-party #delhi-services-bill #delhi-services-bill-in-rajya-sabha #rajya-sabha-passes-delhi-services-bill #delhi-services-bill-passed-in-rajya-sabha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి