Sadbhavana Diwas: రాజీవ్‌గాంధీ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

జాతీయ విద్యా విధానం, జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థ, ఫిరాయింపుల నిరోధక చట్టం లాంటి ఎన్నో గొప్ప విషయాలు రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే వచ్చిన మార్పులు. రాజకీయాల్లో 'మిస్టర్‌ క్లీన్‌'గా పేరు తెచ్చుకున్న రాజీవ్‌ జయంతి ఇవాళ. ప్రతి ఏడాది ఈ రోజున సద్భావన దివస్‌గా జరుపుకొంటున్నాం. పైలట్‌గా కెరీర్‌ ప్రారంభించిన రాజీవ్‌కి మ్యూజిక్‌ అంటే మక్కువ ఎక్కువ. డ్రైవింగ్ పట్ల ప్రేమ..!

New Update
Sadbhavana Diwas: రాజీవ్‌గాంధీ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Rajiv Gandhi Birth Anniversary : ప్రతిఏడాది ఆగస్టు 20న దేశవ్యాప్తంగా సద్భావన దివస్‌ను జరుపుకుంటారు. అన్ని మతాలు, భాషలు, ప్రాంతాల ప్రజల మధ్య జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని పెంపొందించడం ఈ రోజు థీమ్. ఇవాళ 79వ జయంతి సందర్భంగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి కొన్ని ఆసక్తికరమైన, తెలియని విషయాలను తెలుసుకోండి. ఆగస్టు 20, 1944న రాజీవ్ గాంధీ(rajiv gandhi) జన్మించాడు. ఫిరోజ్ గాంధీ(feroz gandhi), ఇందిరా గాంధీ(indira gandhi) దంపతులకు పెద్ద కుమారుడు రాజీవ్. కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ చదివారు. ఆ తర్వాత లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి వెళ్లారు. రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడు సోనియా గాంధీ(ఎడ్విజ్ ఆంటోనియో అల్బినా మైనో)ని కలిశారు. 1968లో సోనియా(sonia gandhi)ను పెళ్లి చేసుకున్నారు. తన సొదరుడు సంజయ్ గాంధీ మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1984లో రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా మరణం తర్వాత దేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యారు.

రాజీవ్ గాంధీ గురించి ఆసక్తికరమైన విషయాలు:

➡ కళల పట్ల మక్కువ:
రాజీవ్ గాంధీకి సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. ముఖ్యంగా పాశ్చాత్య, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. ఆయన ఫోటోగ్రఫీ అంటే కూడా ఇష్టం.

➡ పైలట్‌గా కెరీర్:
1970లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో చేరిన రాజీవ్.

➡ 1981లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజీవ్

➡40 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన భారత ప్రధానిగా రికార్డు సృష్టించిన రాజీవ్.

➡ రాజీవ్ గాంధీ నిక్‌నేమ్‌ 'మిస్టర్‌ క్లీన్‌.'

➡ డ్రైవింగ్ పట్ల ప్రేమ: డ్రైవింగ్ చేయడానికి రాజీవ్‌ ఎక్కువగా ఇష్టపడతాడు

➡ ఫిరాయింపుల నిరోధక చట్టం: ప్రధానిగా ఉన్న సమయంలో, రాజీవ్ గాంధీ 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు.

➡ 1986లో జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు.

➡ 1986లో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థ అనే కేంద్ర ప్రభుత్వ ఆధారిత సంస్థను స్థాపించారు.


మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో శ్రీలంకకు చెందిన వేర్పాటువాద సంస్థ అయిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) సభ్యులు రాజీవ్‌ని హత్య చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు