కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం ఆమెకే.. రేపే రేవంత్ సంతకం!

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం దివ్యాంగురాలు రజినీకి ఇవ్వనున్నారు. రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే జాబ్ గ్యారెంటీ ఫైల్ పై సంతకం చేయనున్నారు. ఇప్పటికే రజినీకి ఆహ్వానం అందించినట్లు సమాచారం.

New Update
కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం ఆమెకే.. రేపే రేవంత్ సంతకం!

తెలంగాణలో గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం కొలవుదీరనుంది. ఎల్‌బి స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండగా ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తిచేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభ్యర్థులంతా ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించిన సంతగతి తెలిసిందే. కాగా తెలంగాణలో మెుదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఆమెకు ఇస్తామని అక్టోబరు‌లో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రేపు ఫైల్ పై సంతకం చేయబోతున్నారని, ఇప్పటికే రజినీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం.

Also read :ఇంజక్షన్లు ఇచ్చి భార్య, పిల్లల్ని చంపిన డాక్టర్.. ఆ తర్వాత ఏం చేశాడంటే

ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే అమ్మాయి.. పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని రేవంత్ రెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. రజినీ బాధను సావదధానంగా విన్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. అదే రోజున, వాళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని రజనికీ హామీ ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయటంతో పాటు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు. రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రేపు జరిగే ప్రమాణ స్వీకారకార్యక్రమానికి రజినీకి ఆహ్వానం పంపించారు. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TS Inter Advanced Supplementary Exams: ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ పరీక్షలు ఎప్పుడంటే?

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. ఇక ఇంటర్ అడ్వాన్సడ్, సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.

New Update

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ విడుదల చేశారు. విద్యార్థులు tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్ పరీక్షలను మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు రాశారు.

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

ఇందులో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మొత్తం 71.37 మంది ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.89 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. ఇక ఇంటర్ అడ్వాన్సడ్, సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

 

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment