Vettaiyan Movie : రజినీకాంత్ 'వేట్టయాన్' ఫస్ట్ సింగిల్ లోడింగ్...

రజినీకాంత్ 'వేట్టయాన్' మూవీ నుంచి వినాయక చవితిని పురస్కరించుకొని ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో 'అర్థమైందా' అంటూ సాగే పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. అందులో రజినీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

New Update
Vettaiyan Movie : రజినీకాంత్ 'వేట్టయాన్' ఫస్ట్ సింగిల్ లోడింగ్...

Rajinikanth's Vettaiyan Movie : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వేట్టయాన్'. తెలుగులో 'వేటగాడు' పేరుతో రాబోతుంది. 'జై భీమ్' మూవీ ఫేమ్ జ్ఞానవేల్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, మ‌ల‌యాళ స్టార్ ఫహద్‌ ఫాజిల్‌, దగ్గుబాటి రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇక నేడు వినాయక చవితిని పురస్కరించుకొని మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో 'అర్థమైందా' అని సాగే మొదటి పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో అక్టోబరు 10న రిలీజ్ అని మరోసారి ప్రకటించారు.


Also Read : పండగ పూట మెగా ట్రీట్..’గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సింగిల్

నిజానికి గత కొద్దీ రోజులుగా ఈ సినిమా అక్టోబరు 10న థియేటర్లలోకి రాకపోవచ్చని టాక్ నడించింది. ఆ ఊహాగానాలు తెరదించుతూ చెప్పిన డేట్ కుకచ్చితంగా రిలీజ్ చేస్తామని మరోసారి తెలిపింది మూవీ యూనిట్. స్టూడియో గ్రీన్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత ఏడాది 'జైలర్' తో సూపర్ స్టార్ కు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన అనిరుద్.. ఈసారి 'వేట్టయాన్' కోసం ఎలాంటి సాంగ్స్ కంపోజ్ చేశాడో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు