Rajini kanth : రజనీ కాంత్‌ సినిమాలో రానా..క్లారిటీ ఇచ్చిన సినిమా బృందం!

రానా ఇప్పటి వరకు హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా రజినీ కాంత్‌ సినిమాలో ఆయన అవకాశం దక్కించుకోవడంతో రానాకి అభిమానులు, సినీ ప్రముఖులు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

New Update
Rajini kanth : రజనీ కాంత్‌ సినిమాలో రానా..క్లారిటీ ఇచ్చిన సినిమా బృందం!

దాదాపు పుష్కర కాలం తరువాత సూపర్ స్టార్‌ రజినీ కాంత్‌ (Rajini kanth) జైలర్‌ (Jailor) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టాడు. జైలర్‌ మూవీ భారీ విజయం సాధించి 600 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ (600 crores )వసూలు చేసింది. ఈ సారి సంక్రాంతికి లాల్ సలాం మూవీతో రజినీ రానున్నారు. అయితే ఈ చిత్రంలో రజినీ కనిపించేది చాలా తక్కువ సేపు అని చిత్ర బృందం ఇది వరకే తెలిపింది.

దీంతో రజినీ అభిమానులు అంతా కూడా తలైవర్‌ 170 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రజినీ నటించే 170 వ సినిమాని జ్ఙానవేళ్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్‌ బయటకు వచ్చింది.

Also read: ఢిల్లీని వణికించిన భూకంపం!

తాజాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా తెలిపారు. ఈ అనౌన్స్ మెంట్ తో అంతా షాక్ అయ్యారు. రానా ఇప్పటి వరకు హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా రజినీ కాంత్‌ సినిమాలో ఆయన అవకాశం దక్కించుకోవడంతో రానాకి అభిమానులు, సినీ ప్రముఖులు కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

అంతేకాకుండా తలైవర్ 170 సినిమాలో ఇంకా కొంతమంది స్టార్లు ఉండబోతున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం, మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి మరో బిగ్గెస్ట్‌ అప్డేట్‌ వచ్చింది.

అలాగే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు, పుష్ప సినిమాలో పోలీసు ఆఫీసర్ గా నటించిన ఫహాద్ ఫాజిల్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో రజినీ రిటైర్డ్‌ అయిన పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

నేచురల్ స్టార్ నాని హిట్ 3 ట్రైలర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ తో అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

New Update


బాహుబలి, RRR రికార్డులు బద్దలు 

హిట్ 3 ట్రైలర్ 24 గంటల్లో 23మిలియన్ల వీక్షణాలను సంచలనాత్మక రికార్డు సృష్టించింది. RRR, బాహుబలి రికార్డులను సైతం బీట్ చేసి.. యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ గా కొనసాగుతోంది.  ఆకర్షణీయమైన కథనం,  మైండ్-బ్లోయింగ్ యాక్షన్ షాట్‌లతో ట్రైలర్  ఆసక్తికరంగా  ఉంది. నాని  స్క్రీన్ ప్రెజెన్స్ భయానకంగా, మునుపెన్నడూ చూడని విధంగా కనిపించింది. భయంకరమైన పోలీస్ అధికారిగా అదరగొట్టారు నాని.  'హిట్3' మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: Indian Film Pyre: ఇమాజిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 'పైర్' చిత్రానికి ఏకంగా 6 విభాగాల్లోనామినేషన్

ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. బోర్డు నుంచి 18+ సర్టిఫికెట్ పొందింది. కొన్ని సన్నివేశాల్లో బూతులు, రక్తపాతం, వాయిలెన్స్ ఉండడం వల్ల 18+ సర్టిఫికెట్ వచ్చింది. పిల్లలు, సున్నితమైన స్వభావం కలవారు ఈ చిత్రానికి దూరంగా ఉండాలి.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన  ఈ మూవీలో శ్రీనిధి శెట్టి కథనాయికగా నటించగా.. రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

telugu-news | latest-news | cinema-news

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment