Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్లు అధికారులు వివరించారు.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Rain Alert For Telangana State : తెలంగాణ (Telangana) లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖాధికారులు (IMD) తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్లు అధికారులు వివరించారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి.

పలు జిల్లాల్లో గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌న్నారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. గ‌త రెండు రోజుల నుంచి ఎండ‌లు విపరీతంగా ఉండడంతో.. ఉక్క‌పోత‌తో న‌గ‌ర వాసులు ఇబ్బంది ప‌డుతున్నారు. శుక్ర‌వారం సాయంత్రం చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

ఇక వ‌ర్షం కురవడంతో న‌గ‌ర వాసుల‌కు ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగింది. పంజాగుట్ట‌, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గ‌చ్చిబౌలి, మెహిదీప‌ట్నం, బంజారాహిల్స్, ఉప్ప‌ల్, తార్నాక‌, హ‌బ్సిగూడ, గుండ్ల‌పోచంప‌ల్లి, బ‌హ‌దూర్‌ప‌ల్లి, పేట్‌బ‌షీరాబాద్, సుచిత్ర‌, జీడిమెట్ల‌, కొంప‌ల్లి, సూరారంతో పాటు సికింద్రాబాద్, బోయిన్‌ప‌ల్లి, బేగంపేట్, స‌న‌త్‌న‌గ‌ర్, ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో భారీ వ‌ర్షం కురిసింది. యాదాద్రి భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట జిల్లాలో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షం పడింది.

Also read: ఆర్టీసీ బస్సు బోల్తా… 20 మంది ప్రయాణికులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు