Rain Alert: రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. అత్యవసరం అయితేనే బయటకు!

రానున్న రెండు రోజుల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు ప్రజలకు సూచించారు.

New Update
AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!

Rain Alert: నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం సాయంత్రం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. ఈక్రమంలో రానున్న రెండు మూడు రోజులపాటు నగరవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

శుక్రవారం కురిసిన భారీ వర్షం వల్ల చాదర్ ఘాట్, మలక్ పేటలలో వరద నీరు నిలిచిపోయింది. చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట, దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఐటీ కారిడర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ స్తంభించిందని పోలీసులు తెలిపారు. నగరంలో హై అలర్ట్‌ జారీచేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వర్షాల వల్ల ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. కాగా నిరంతరాయంగా కురుస్తున్న వానలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ అందుకే ప్రకటించలేదు: ఈసీ

Advertisment
Advertisment
తాజా కథనాలు