Telangana : నగర వాసులకు చల్లని కబురు.. నేడు, రేపు తేలికపాటి వానలు!

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Update
Telangana : నగర వాసులకు చల్లని కబురు.. నేడు, రేపు తేలికపాటి వానలు!

Rain Alert : రాష్ట్రంలో భానుడు(Sun)  భగభగ మండిపోతున్నాడు. సూర్య ప్రతాపంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే నమోదవుతోంది. అయితే తెలంగాణ(Telangana) లో గత మూడు రోజులుగా వాతావరణం(Weather) లో మార్పులు ఏర్పడ్డాయి. దీంతో పరిస్థితిలు కొంచెం మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.

తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ(IMD) చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.నిర్మల్, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వంటి జిల్లాల్లో వానలు కురిసే అవకాశ ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఆ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేశారు.

బుధవారం అర్థరాత్రి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడింది. ఆదిలాబాద్ అర్బన్‌లో 9.5 మిమీ వర్షపాతం నమోదు కాగా.. నిర్మల్ జిల్లా విశ్వనాథ్ పేటలో 8 మిమీ వర్షపాతం నమోదైంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురువడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

Also read: ఒంగోలులో రణరంగంగా మారిన ప్రచారం!

Advertisment
Advertisment
తాజా కథనాలు