Summer Special Trains : వేసవి కాలం ప్రత్యేక రైళ్లు.. రెండు నెలల పాటు 1079 ట్రిప్పులు!

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్‌ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం

Indian Railways : వేసవి కాలాన్ని(Summer Season) దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్‌ రైల్వే(South Central Railway) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్‌ రైల్వే ఆధ్వర్యంలోనూ దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా 9,111 ట్రిప్పు లు నడుపుతున్నామని అధికారుఉల పేర్కొన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి(Financial Year 2023-24) గాను రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నెట్‌వర్క్‌ రికార్డు సృష్టించినట్లు అధికారులు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 649 కిలోమీటర్ల మేర ట్రాక్‌ పునరుద్ధరణ చేశామని, ఈ సారి 45 శాతం అధికంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి జూన్‌ 15 వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మైసూర్‌-ముజఫర్‌పూర్‌, బెంగళూరు-మాల్దాటౌన్‌, బెంగళూరు-బీదర్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు(Special Trains) రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.

Also read:  నేడు వైఎస్‌ షర్మిల నామినేషన్‌ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment