అవిశ్వాసతీర్మానంపై లోక్ సభలో కీలక చర్చ నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. నిజానికి ఎన్డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాదని, ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ హింసపై మాట్లాడతారని INDIA కూటమి చెబుతోంది By Trinath 08 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి Rahul To Deliver his Speech on No Confidence Motion : 3 నెలలకు పైగా మణిపూర్ తగలబడిపోతోంది. మహిళల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు కొందరు దుండగులు. ఆ అరాచకంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. మరోవైపు మణిపూర్ (Manipur) హింసపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు విపక్ష కూటమి ఇండియా సభ్యులు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అవిశ్వాస తీర్మానమిచ్చారు. దీనిపై కాసేపట్లో చర్చ జరగనుంది.అధికార NDA, విపక్ష INDIA కూటముల మధ్య లోక్‌సభలో వాడివేడి మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఇక సుప్రీంకోర్ట్ తీర్పుతో ఎంపీ సభ్యత్వాన్ని తిరిగిపొందిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నారు . మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంతో పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ కీలక ప్రసంగం చేయనున్నట్టు తెలుస్తోంది. ఐతే మూడ్రోజుల పాటు జరిగే చర్చలో చివరి రోజు అంటే..గురువారం ప్రధాని మోదీ..మణిపూర్ ఘటనపై సమాధానమివ్వనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచి మణిపూర్ ఘటనలపై ప్రధాని స్పందించాలంటూ పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. ఐతే అధికార పక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉభయసభల్లోనూ వాయిదాల పర్వం నడిచింది. చివరికి.. జులై 26న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది విపక్షం. ఈ ప్రభుత్వం పట్ల తమకు విశ్వాసం పోయిందని, దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఇలాగైనా మోదీ మణిపూర్ ఘటనపై మాట్లాడతారని భావిస్తోంది. మరోవైపు విపక్షాల ఆందోళనల మధ్యే..ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకుంది. అయితే.. ఎన్డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాదని, ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్‌కు వచ్చి మణిపూర్ హింసపై మాట్లాడతారని ఇండియా కూటమి చెబుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ అవిశ్వాస తీర్మానం.. అటు అధికారపక్షానికి, ఇటు విపక్షానికి కీలకంగా మారింది. ఇందులో నెగ్గి బీజేపీ తన బలాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. అదే సమయంలో ప్రజల నుంచి మద్దతు పొందేందుకు ఇది మంచి అవకాశం అని కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. Also Read: ఢిల్లీ సర్వీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఎన్డీఏ కూటమికి 131ఓట్లు #rahul-gandhi #manipur #rahul-gandhi-return-to-loksabha #manipur-issue #rahul-to-deliver-his-speech-on-no-confidence-motion #rahul-no-confidence-motion #rahul-gandhi-to-speak-on-no-confidence-motion #no-confidence-motion-debate-in-lok-sabha #rahul-gandhi-in-lok-sabha #manipur-voilence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి