Congress: రాహుల్ గాంధీ ఆస్తుల విలువ రూ. 20కోట్లు! కాంగ్రెస్ అగ్రనేత తన ఆస్తుల వివారలను ఎన్నికల అఫడవిట్ లో పొందుపరుచారు. మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్ల గా అఫడవిట్ లో పేర్కొన్నారు. గమనార్హం ఏంటంటే రాహుల్ కు సొంత కారు కూడా లేదు. By Durga Rao 04 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi Assets: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) వరుసగా రెండోసారీ కేరళ (Kerala)లోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ (Lok Sabha elections) అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. రాహుల్ తను దాఖలు చేసిన అఫిడవిట్ లో రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో రూ.9.24 కోట్ల చరాస్తులు, రూ. 11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ (Affidavit)లో పొందు పరిచారు. వాయనాడ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రాహుల్ గాంధీ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం రాహుల్ గాంధీ పేరు మీద కేవలం రూ.20 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. రాహుల్ కు ఫ్లాట్ కానీ సొంత కారు కానీ లేవు. రాహుల్ కు ఉన్న ఆస్తుల్లో 9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇందులో 55 వేల నగదు, 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 4.33 కోట్ల బాండ్లు, 3.81 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, రూ.15.21 లక్షల విలువైన బంగారం బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన బంగారు అభరణాలు మాత్రమే ఉన్నాయి. Also Read: సంగారెడ్డిలో అగ్ని ప్రమాదానికి కారణం అదే.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు రాహుల్ కు ఉన్న స్ధిరాస్తుల విలువ రూ.11.15 కోట్లు. ఇందులో తన సోదరి ప్రియాంక గాంధీతో ఉమ్మడిగా పంచుకంటున్న ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయభూమి ఉంది. అలాగే గురుగ్రామ్ ప్రాంతంలో రూ.9 కోట్ల విలువైన ఆఫీసు ఉన్నాయి. అలాగే ఈ ఆఫీసు తన స్వార్జితం అని, వ్యవసాయ భూమి తన తాత ముత్తాల వారసత్వంగా వచ్చిందని రాహుల్ తెలిపారు. మరోవైపు తనపై ఉన్న కేసుల వివరాలను కూడా రాహుల్ వెల్లడించారు. ఇందులో పోస్కో కేసు కూడా ఉంది. అత్యాచార బాధితురాలి వివరాలు బయటపెట్టినందుకు ఇది నమోదైనట్లు తెలిపారు. అలాగే బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసులు కూడా ఉన్నట్లు రాహుల్ తెలిపారు. #congress #rahul-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి