Rahul Gandhi: ఈ నెల 14 నుంచి రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14న ప్రారంభమై మార్చి 20 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ్ యాత్ర జరగనుంది. మొత్తం 15 రాష్ట్రాలు, 110 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. By V.J Reddy 04 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi Bharat Nyay Yatra: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ్ యాత్ర(Bharat Nyay Yatra) పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. జోడో యాత్రకు (Jodo Yatra) కొనసాగింపుగా ఈ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు న్యాయ యాత్ర కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనుంది. ALSO READ: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఈ భారత్ న్యాయ యాత్ర 6,700కి.మీ. వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ (Congress Party) వర్గాలు తెలిపాయి. బస్సు, కాలినడకన యాత్ర సాగనుంది. 66 రోజులు 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల మీదుగా యాత్రను చేపట్టనున్నారు రాహుల్. జనవరి 14న మణిపూర్ లో యాత్ర ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మార్చి 20న ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని వెల్లడించింది. Here is the route map of the Bharat Jodo Nyay Yatra being launched by the Indian National Congress from Manipur to Mumbai on January 14, 2024. @RahulGandhi will cover over 6700 kms in 66 days going through 110 districts. It will prove as impactful and transformative as the… pic.twitter.com/ZPxA5daZEb — Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2024 ఈ యాత్ర 15 రాష్ట్రాలు.. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలల్లోని 110 జిల్లాల పరిధిలో 6700 కి.మీ.ల దూరం సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా యూపీలో 11 రోజుల్లో 20 జిల్లాల మీదుగా యాత్ర కొనసాగనుంది. అస్సాంలో 8 రోజులు 17 జిల్లాల మీదుగా పాదయాత్ర ఉండనుంది. ఈ యాత్ర ద్వారా ఎలాంటి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ లేదని వివరించారు. ప్రజలు పడుతున్న సమస్యలను తెలుకోడానికే ఈ యాత్ర చేస్తున్నామని వెల్లడించారు. భారత్ న్యాయ్ యాత్ర 🇮🇳 pic.twitter.com/kfMJSTEbWa — Telangana Congress (@INCTelangana) December 31, 2023 #rahul-gandhi #congress-party #bharat-nyay-yatra #bharat-jodo-yatra #rahul-bharat-nyay-yatra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి