Rahul Gandhi: AM, PM తేడా తెలియకపోతే ఆయనెలా ప్రధాని కాగలరు? జీవిత పుస్తకంలో 'ప్రణబ్‌' ఎద్దేవా!

రాహుల్ గాంధీ కార్యాలయానికి 'AMకి' 'PMకి' మధ్య తేడా తెలియదని ప్రణబ్‌ తనతో అన్నట్లు ఆయన కుమార్తే శర్మిష్ఠ చెప్పారు. ‘ఇన్‌ ప్రణబ్‌, మై ఫాదర్‌’ పేరుతో ఆమె పుస్తకాన్ని రాశారు. ఓ ఆర్డినెన్స్‌ను రాహుల్‌ చెత్తబుట్టలో పడేసిన తీరుపై తన తండ్రి కలత చెందినట్లు తెలిపారు.

New Update
Rahul Gandhi: AM, PM తేడా తెలియకపోతే ఆయనెలా ప్రధాని కాగలరు? జీవిత పుస్తకంలో 'ప్రణబ్‌'  ఎద్దేవా!

రాహుల్‌గాంధీ(Rahul Gandhi)పై కాంగ్రెస్‌ సీనియర్ల నుంచే తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు జోడోయాత్ర తర్వాత రాహుల్‌ గ్రాఫ్‌ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్న మాటే నిజమే కావొచ్చు కానీ.. గతంలో రాహుల్‌పై సీనియర్లు చాలా అసంతృప్తిగా ఉండేవారని వారి మాటలు వింటేనా అర్థమవుతుంది. ఇక దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాల్సిన నేత అని.. కానీ సోనియాగాంధీ అలా జరగనివ్వలేదని బీజేపీ నేతలు అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తుంటారు. ఇక తాజాగా ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తే శర్మిష్ఠ తన తండ్రిపై ఒక పుస్తకాన్ని రాశారు. ‘ఇన్‌ ప్రణబ్‌, మై ఫాదర్‌: ఏ డాటర్‌ రిమెంబర్స్‌’ పేరుతో పుస్తకాన్ని రాశారు. ఇందులో రాహుల్‌ గాంధీపై ప్రణబ్‌ ముఖర్జీ(Pranab Mukherjee) అభిప్రాయాలను రాశారు. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

publive-image ‘ఇన్‌ ప్రణబ్‌, మై ఫాదర్‌: ఏ డాటర్‌ రిమెంబర్స్‌’

ఆ ఘటన కలిచివేసింది:
ఆర్జేడీ(RJD) అధినేత లాలూ యాదవ్‌పై అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌ గాంధీ చెత్తబుట్టలో పడేసిన తీరుపై తన తండ్రి కలత చెందారని శర్మిష్ఠ ముఖర్జీ(Sharmishtha Mukherjee) 'ఇండియా టుడే'కి వచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాటలు రాజకీయంగా అపరిపక్వంగా ఉన్నాయని ఆమె తండ్రి తనతో పలు సందర్భాల్లో చెప్పినట్లు శర్మిష్ఠ చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ తరచుగా పార్లమెంటుకు గైర్హాజరు కావడం పట్ల ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తిగా ఉండేవారని శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు.


AMకి PMకి తేడా తెలియదు:
ప్రణబ్‌ ముఖర్జీకి ప్రతీ ఉదయం మొఘల్ గార్డెన్స్‌లో (ప్రస్తుతం అమృత్ ఉద్యాన్) వాకింగ్‌ చేసే అలవాటు ఉంది. మార్నింగ్‌ వాక్‌ సమయంలో ప్రణబ్‌ ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు. పూజ చేసే సమయంలోనూ ఎవరితోనూ మాట్లాడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఈ విషయం ఆయన గురించి తెలిసినవారందరికి తెలుసు. అయితు ఓ ఉదయం రాహుల్‌ గాంధీ ప్రణబ్‌ని కలవడానికి వచ్చారు. అది కూడా మార్నింగ్ వాక్‌ సమయంలో. నిజానికి ప్రణబే రాహుల్‌ని కలవమన్నారు. అయితే రాహుల్ కార్యాలయం పొరపాటున మీటింగ్ ఉదయం(AM) అని తెలియజేసింది. ఈ ఘటన గురించి ADCలలో ఒకరి నుంచి తెలుసుకున్నట్లు శర్మిష్ఠ చెప్పారు. 'నేను మా నాన్నను అడిగినప్పుడు, ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు, 'రాహుల్ కార్యాలయం 'AM' 'PM' మధ్య తేడాను గుర్తించలేకపోతే, PMO ఆఫీస్‌ను ఎలా పాలించగలరు' అని ప్రశ్నించారు.

Also Read: డిన్నర్ చేయగానే ఈ పని చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు