Rahul: నేటి నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' షురూ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

New Update
Rahul: నేటి  నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' షురూ

Rahul Gandhi : భారత్(India) జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్(Congress) నేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) కు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. మణిపూర్(Manipur) నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. ఈరోజు మొదలయ్యే ఈ యాత్ర మార్చి 20వ తేదీ వరకు కొనసాగనుంది. మార్చి 20న ముంబై(Mumbai) లో ఈ యాత్ర ముగియనుంది. నిరుద్యోగిత, పెరిగిన ధరలు, సామజిక న్యాయం పలు కీలక సమస్యలు సహా పలు స్థానికి సమస్యలను ఆలకిస్తూ రాహుల్ గాంధీ ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లానున్నారు.

రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 100 లోక్‌ సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6713కిలోమీటర్లు కవర్‌ చేయనుంది. రాహుల్ గాంధీ యాత్రకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో..

6,713 కిలోమీటర్లపాటు సాగే యాత్ర ఎక్కు వగా బస్సు యాత్రకాగా కొంతమేర పాద యాత్రగా ముందుకుసాగనుంది. 110. జిల్లాల్లోని 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ 67 రోజులపాటు యాత్ర చేపట్టసున్నారు. యాత్ర అత్యధికంగా 11 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ లో కొనసాగనుంది. రాజకీయంగా కీలకమైన అమేథీ, రాయ్ బరేలీ, మోడీ నియోజకవర్గం వారణాసి గుండా యాత్ర ఉంటుంది.

మణిపూర్ లో టెన్షన్...

రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి మణిపూర్ బీజేపీ సర్కార్ షాక్ ఇచ్చింది. రాహుల్ చేపట్టే ఈ యాత్రకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. మణిపూర్‌ అల్లర్లు, శాంతి భద్రతల దృష్ట్యా భారత న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే.. ఈరోజు రాహుల్ తన యాత్రను ప్రారంభించనున్న నేపథ్యంలో మణిపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తీ ఏర్పాటు చేశారు.

Also Read : రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లోక్ సభకు ముందే ఫ్రీ కరెంట్, రుణమాఫీ?

Advertisment
Advertisment
తాజా కథనాలు