Rahul Gandhi: పదేళ్ల తరువాత స్వాతంత్య్ర వేడుకల్లో రాహుల్ దేశ 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. 2014 నుంచి 2024 వరకు ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదు. దీంతో పది సంవత్సరాలుగా ప్రతిపక్ష నేత హోదాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేదు. By Bhavana 15 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi: ఎర్రకోటలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్ సభ పత్రిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విన్నారు. గత కొంతకాలంగా ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి. 2014 నుండి 2024 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరూ లేరు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలలో ఎవరికీ అవసరమైన సంఖ్యలో ఎంపీ స్థానాలు లేవు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఎంపీల సంఖ్యను పెంచుకున్న తర్వాత జూన్ 25న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా నియమించారు. పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని వివరించారు. భారత యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. Also Read: కొడుకును పణంగా పెట్టి…భగత్‌సింగ్ ను కాపాడిన బాబీ! #congress #bjp #modi #indepedence-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి