Raghunandan Rao : ఎంపీ సీట్లను బేరానికి పెట్టారు.. బీఆర్‌ఎస్‌పై రఘునందన్ రావు విమర్శలు బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బీజేపీ సీనియర్ నేత రఘునందన్‌రావు. తాము కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామంటూ కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. By Naren Kumar 24 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Raghunandan Rao Comments : బీఆర్ఎస్(BRS) నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ(BJP) సీనియర్ నేత రఘునందన్‌రావు(Raghunandan Rao). తాము కాంగ్రెస్(Congress) తో కలిసి పనిచేస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. హైదరాబాద్(Hyderabad) లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు ఉద్యమకారుల పేరు వాడుకుని బీఆర్ఎస్ నేతలు వారికి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తప్పును ఒప్పుకొని తెలంగాణ(Telangana) అమరవీరుల స్థూపం వద్ద చెంపలేసుకొవాలని డిమాండ్ చేశారు. కష్టపడేవారికి బీఆర్‌ఎస్‌లో ఏనాడూ గుర్తింపులేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సీట్లు ఇస్తామని కేటీఆర్, హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బాలరాముడు అందరికీ దేవుడే.. జై శ్రీరామ్ అంటూ చైనా సైనికులు నినాదాలు..!! రాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక పదవుల్లో ఉంటూ వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్న అధికారులకు రాజకీయపరమైన పదవులు కట్టబెట్టారని, సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే ఆలోచనలోనే ఆ పార్టీ నాయకులు ఉన్నారని విమర్శలు కురిపించారు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్, బీజేపీ భిన్నమైన పార్టీలని, బీఆర్‌ఎస్ కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అహంకారం వల్లే బీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు దూరమయ్యారని, అయినా వారి తీరు మారడం లేదని అని రఘనందన్‌రావు అన్నారు. #brs #congress #bjp-mla #bjp-raghunandan-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి