IND VS ENG :నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం –వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుదీర్ బాబు

ఉప్పల్ స్టేడియంలో జనవరి25 నుంచి భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ కోసం భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో 360సీసీ కెమెరాలతో నిఘా,1500 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్‌, స్పెషల్‌ టీమ్స్‌ మఫ్టీలో ఉంటాయన్నారు

New Update
IND VS ENG :నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం –వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుదీర్ బాబు

IND VS ENG Test Match in Uppal Stadium : భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య  ఈ రోజు ( జనవరి 25) న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పట్లు  చేసినట్లు రాచకొండ సీపీ సుదీర్ బాబు పేర్కొన్నారు. 3 ఏళ్ల తర్వాత భారత్‌లో ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనున్న నేపద్యంలో అతిథి జట్టు ఇంగ్లాండ్‌ను అహ్వానించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీపి తెలిపారు.

ఉదయం 6.30 గంటల నుంచే అనుమతి

భద్రతా ఏర్పాట్లలో భాగంగా స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో360 సీసీ కెమెరాలు అరేంజ్ చేయడంతో పాటు  సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసామని,మ్యాచ్ ను చూసేందుకు గురువారం ఉదయం 6.30 గంటల నుంచే క్రికెట్ అభిమానులను ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తామని  సీపీ వెల్లడించారు.

1500 మంది పోలీసులు ,100 షీ టీమ్స్, ఆక్టోపస్ బలగాలు రంగంలోకి 

ఇక.. క్రికెట్ అంటే అభిమానుల కోలాహలం , ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. పీక్ హవర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి... స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని , 1500 మంది పోలీసులతో మ్యాచ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించుతున్నామని ,100  షీ టీమ్స్ మఫ్టీ లోఉంటారని వెల్లడించారు. అయితే .. మా పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని అన్నారు.

ఒకసారి లోపలికి వెళ్లి బయటకి వస్తే.. మళ్ళీ నో ఎంట్రీ 

వెండర్స్ ని కూడా వెరిఫై చేసిన తర్వాతే పాసులు జారీ చేశామని , ఒకసారి లోపలికి వెళ్లి బయటకి వస్తే... తిరిగి మళ్ళీ స్టేడియం లోపలికి అనుమతించడానికి వీలు లేదని స్పష్టం చేసారు. ఇక.. మ్యాచ్ కి వచ్చేవారికి సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని , బ్లాక్ లో టికెట్స్ అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

వీటికి నో పర్మిషన్ 

కెమెరాలు, ల్యాప్తోప్స్, బ్యాగ్స్, సిగెరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్ అనుమతించమని,  డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ ఉండాలని రాచకొండ సేపీ సుదీర్ బాబు పేర్కొన్నారు.

జనవరి 25 నుంచి మార్చి 11 వరకు

ఇక.. ఈ రెండు జట్లు  చివరిసారి  2021లో తలపడగా, ఈ సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో విజయం సాధించింది.భారత్ జట్టు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ గా బరిలోకి దిగనున్న ఈ టెస్ట్ సిరీస్ జనవరి 25 నుంచి మార్చి 11 వరకు కొనసాగుతుంది.

ALSO READ: ఈ సిరీస్‌లో రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడటం లేదు.. ద్రవిడ్

Advertisment
Advertisment
తాజా కథనాలు