S Mohanty: ఒడిశాలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. డబ్బుల్లేక పోటీనుంచి తప్పుకున్న ఎంపీ అభ్యర్థి!

ఒడిశాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పూరీ ఎంపీ అభ్యర్థి సుచరిత మొహంతీ పోటీనుంచి తప్పుకున్నారు. ప్రచారం కోసం పార్టీ నుంచి నిధులు అందట్లేదని, సొంతంగా ఖర్చు చేసే స్తోమత లేక టికెట్ వాపస్ చేస్తూ ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు.

New Update
S Mohanty: ఒడిశాలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. డబ్బుల్లేక పోటీనుంచి తప్పుకున్న ఎంపీ అభ్యర్థి!

Odisha: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీకీ అభ్యర్థుల నుంచి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే సూరత్‌, ఇందౌర్‌లో పలువురు ఎంపీ అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులతో నామినేషన్లు ఉపసంహరించుకోగా.. తాజాగా ఒడిశా (Odisha)లోని పూరీ (Puri) లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతీ (Sucharita Mohanty) పోటీనుంచి తప్పుకున్నారు.

సొంత డబ్బే ఖర్చు పెట్టుకోమన్నారు..
ఈ మేరకు సుచరిత మాట్లాడుతూ.. ప్రచారం కోసం పార్టీ నుంచి తనకు నిధులు అందట్లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సొంతంగా ఖర్చు చేసేంత ఆర్థిక స్తోమత తనకు లేదని, అందుకే టికెట్ వాపస్ చేస్తూ ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. ‘పార్టీ నిధులు సమకూర్చకపోవడంతో ప్రచారానికి ఇబ్బందిగా ఉంది. ఏఐసీసీ ఒడిశా ఇన్‌ఛార్జ్‌కి చెబితే మా సొంత డబ్బే ఖర్చు పెట్టుకోమన్నారు. నేను నెలవారి జీతం మీద ఆధారపడే జర్నలిస్టును. ఇప్పటికే నా దగ్గర ఉన్న మొత్తం ప్రచారం కోసం ఖర్చు చేశా. ప్రజల నుంచి విరాళాలు కోరినా పెద్దగా రావట్లేదు. నా దగ్గర మొత్తం మిగల్లేదు. ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నాను' అంటూ లేఖలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Sex scandal: 2011లో ఎన్డీ తివారీ.. ఇప్పుడు మరో గవర్నర్.. సెక్స్ కుంభకోణం అసలు కథేంటి!?

ఇక 6 విడతలో భాగంగా పూరీ లోక్‌సభ స్థానానికి మే 25న పోలింగ్‌ జరగనుండగా.. నామినేషన్ల సమర్పణకు మే 6 ఆఖరు. కాగా సుచరిత ఇప్పటివరకూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు