AP Politics: పొత్తు లేనట్టేనా? తేల్చేసిన పురందేశ్వరి!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు.కేంద్ర పెద్దలతో పొత్తులపై చర్చే జరగలేదని చెప్పారు. రాష్ట్రంలోని 25 ఎంపీ,175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని పురందేశ్వరి చెప్పడం చూస్తుంటే బీజేపీకి టీడీపీ,జనసేనతో పొత్తు పెటాకులేనాన్న డౌట్ వస్తోంది.

New Update
AP Politics: పొత్తు లేనట్టేనా? తేల్చేసిన పురందేశ్వరి!

TDP-Janasena-BJP Alliance: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఇప్పటికీ క్లారిటీ లేదు. మరో నెల రోజుల్లో ఎన్నికలు (AP Elections) జరిగే అవకాశముంది. అయినా ఇప్పటివరకు ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులపై కూడా స్పష్టత లేదు. జనసేన-టీడీపీ కలిపి 99 సీట్లు ప్రకటించుకున్నాయి.. మిగిలిన 76 సీట్ల గురించి ఊసే లేదు. ఎందుకంటే పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నాన్చుడు ధోరణి టీడీపీ-జనసేన క్యాడర్‌ను కన్ఫ్యూజన్‌లో పెడుతోంది. ఇటు చంద్రబాబు (Chandrababu), పవన్‌ (Pawan Kalyan) మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 7) అమిత్‌షాను కలిసేందుకు పవన్‌, చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.

పొత్తు లేనట్టేనా?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్దలతో పొత్తులపై చర్చే జరగలేదని చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీకి టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లడం ఇష్టంలేదానన్న అనుమానం కలుగుతోంది. కేంద్ర పెద్దలతో మీటింగ్‌లో పొత్తుల ప్రస్తావన రాలేదని.. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి గురించి అధినేతలకు వివరించామన్నారు పురందేశ్వరి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందని.. ఏపీలో జరిగిన బీజేపీ సమావేశంపై నివేదిక ఇచ్చామన్నారు.

ఏం జరగబోతుంది?
రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసిన ఆశావాహుల జాబితాను అధిష్టానానికి అందజేశామని.. మరోసారి అధిష్టానం పెద్దలతో సమావేశాలు ఉంటాయని చెప్పారు పురందేశ్వరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతల సమావేశం ముగిసిన తర్వాత పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు పవన్‌, చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. అటు పురందేశ్వరి ఏమో పొత్తుల గురించి కోర్‌ కమిటీ మీటింగ్‌లో చర్చ జరగలేదని చెబుతున్నారు. దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతోంది.. ఏం జరగబోతోంది.. ఈ త్రికూటమి సాధ్యమేనా? బీజేపీ వెనకి నుంచి వైసీపీకి సపోర్ట్ ఇస్తూ కావాలనే పొత్తులపై నాన్చుతుందానన్న డౌట్స్ వస్తున్నాయి.

Also Read: కక్ష సాధింపేనా? జనసేన సిబ్బంది నివసించే అపార్ట్‌మెంట్లలో పోలీసుల తనిఖీలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు