Purandeshwari : ఓటర్ల జాబితా తనిఖీ చేయాల్సిందే: పురంధేశ్వరి! ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఓటర్ల జాబితా ల గురించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు, ఓటర్లు జాబితాలో పేర్ల విషయంలో నిత్యం ఆందోళన కొనసాగుతుందన్నారు. By Bhavana 21 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఓటర్ల జాబితా ల గురించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు, ఓటర్లు జాబితాలో పేర్ల విషయంలో నిత్యం ఆందోళన కొనసాగుతుందన్నారు. ఓటు అనే ఆయుధాన్ని దుర్వినియోగం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. ఓటు అంటే ఎంతో ముఖ్యమైనది. ప్రజలు తాము కోరుకున్న ప్రభుత్వాన్ని అధికార పీఠం మీద కూర్చొబెట్టగలిగే ఆయుధం. అలాంటి ఆయుధాన్ని కూడా కొందరు దుర్వినియోగం చేసేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. అర్హులైన వారందరిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమకు అనుకూలం అయిన వారిని మాత్రమే జాబితాలో ఉంచడం, అనుకూలంగా లేని వారిని తొలగించడం వంటి చేస్తున్నారని మండిపడ్డారు.పార్టీలు ఓటర్ల జాబితాలను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఉరవకొండలో అర్హులైన ఓట్ల తొలగింపులో ఇద్దరు అధికారుల్ని తొలగించారని, జడ్పీ సీఈఓలుగా పనిచేసిన భాస్కర్ రెడ్డి, స్వరూపరాణిలపై ఈసీ చర్యలు తీసుకుందన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు ఓటర్ల జాబితాలు తనిఖీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే జరిగి ఉంటుందనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు అధికార పార్టీ పాల్పడుతోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా రూపకల్పనపై ఎలా ముందుకు వెళ‌్ళాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. మరోవైపు విజయవాడలో నిర్వహించిన పార్టీ సమావేశానికి బండి సంజయ్ కుమార్ హాజరు కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో పర్యటన రద్దైంది. విమానం ఆలస్యం కావడంతో భేటీలో వర్చువల్‌గా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఫార్మ్ 6, ఫార్మ్ 7, ఫార్మ్ 8ల ద్వారా కొత్త వారిని చేర్చడం, లేని వారిని తొలగించడం, సవరణలు చేపట్టడం వంటి విషయాలపై కార్యక్రమాలను చేపడతామన్నారు. #vijayawada #bjp #purandheswari #voters-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి