టమాటాల వాడకం మానేయండి..రాజ్‌ భవన్‌ కు పాకిన సెగ!

తాజాగా టమాట మంట పంజాబ్‌ రాజ్‌భవన్‌ కు పాకింది. కిలో రూ.200 నుంచి 350 రూపాయల వరకు ఉన్న ధరలతో పంజాబ్‌ గవర్నర్‌ కూడా భయపడిపోయారు. ఇక నుంచి తనకు టమాటాలు లేకుండా వంట చేయాలని చెప్పారు. దాంతో రాజ్ భవన్‌ మోనూ నుంచి టమాటాలను తొలగించారు.

New Update
టమాటాల వాడకం మానేయండి..రాజ్‌ భవన్‌ కు పాకిన సెగ!

Punjab Governor Banwarilal Purohit : గత కొద్ది రోజులుగా టమాటా ధరలు సామాన్యులనే కాదు, రాజకీయ నాయకులను కూడా బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకి క్రమక్రమంగా పైకి వెళ్తుందే తప్ప కిందకి దిగడం లేదు. ఈ ధరల వల్ల మధ్యతరగతి వాళ్లే కాదు..కాస్త స్థితిమంతులు కూడా హడలిపోతున్నారు.

తాజాగా టమాట(Tomatoes) మంట పంజాబ్‌ రాజ్‌భవన్‌(Punjab Raj Bhavan) కు పాకింది. కిలో రూ.200 నుంచి 350 రూపాయల వరకు ఉన్న ధరలతో పంజాబ్‌ గవర్నర్‌ కూడా భయపడిపోయారు. ఇక నుంచి తనకు టమాటాలు లేకుండా వంట చేయాలని చెప్పారు. దాంతో రాజ్ భవన్‌ మోనూ నుంచి టమాటాలను తొలగించారు.

టమాటాలు బదులు వేరే ప్రత్యామ్నాయం ఏదైనా చూసుకోవాలని చెప్పారు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌(Punjab Governor Banwarilal Purohit). ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి అధికారికంగా ఓ ప్రకటన చేశారు. అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న పంజాబ్ ప్రజలకు మద్దతుగా తానూ టమాటాల వాడకం తగ్గించినట్టు స్పష్టం చేశారు పురోహిత్.

ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు. ఏదైనా కూరగాయల ధర విపరీతంగా పెరిగినప్పుడు వాటి వాడకం తగ్గించుకోవాలి. లేదంటే దానికి బదులు మరోకటి ఏదైనా వాడుకోవాలి.అప్పుడు అదే దిగొస్తుంది. డిమాండ్ తగ్గితే ఆటోమెటిక్‌గా ధర కూడా తగ్గుతుంది. ప్రజలంతా టమాటాలకు ప్రత్యామ్నాయం చూసుకుంటారని ఆశిస్తున్నాను.

నేను అందుకే తగ్గించాను. వాతావరణ పరిస్థితులు కావచ్చు, మార్కెట్‌లో అనిశ్చితి కావచ్చు...టమాటాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ వాడకం తగ్గించాలన్న నిర్ణయం నా నుంచే మొదలవ్వాలని అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయం అని బన్వరిలాల్‌ పేర్కొన్నారు.

కొంతకాలం క్రితం యూపీ మంత్రి ప్రతిభ శుక్లా కూడా టమాటా ధరలను గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వీలుంటే టమాటాలు పెంచుకోవాలని, లేదంటే వాటిని తినడమే మానేయాలని అన్నారు. దీంతో కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టమాటా ధరలు రానున్న రోజుల్లో 300 దాటే అవకాశాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో టామాటా ధరలు కిలో రూ.250-260కి పెరిగాయి. ఆగస్టు 2న మదర్ డెయిరీకి చెందిన సఫల్ ఔట్ లెట్లలో కిచెన్ స్టాపుల్ కిలో రూ.259కి విక్రయించారు.

మరో నెల రోజుల్లో కిలో టమాటా ధర రూ.300కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా సరఫరా తక్కువగా ఉండడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని అన్నారు.

Also Read: ఫోటో తీయించుకుంటే..టమాటాలు ఉచితం!

Advertisment
Advertisment
తాజా కథనాలు