Pune: పూణె లగ్జరీ పోర్షే కారు యాక్సిడెంట్ కేసులో కీలక మలుపులు! పూణెలోని కళ్యాణి నగర్‌లో లగ్జరీ పోర్షే కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కారు ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్లు నిందితుడి తండ్రి తెలిపాడు. దీంతో డ్రైవర్, సురేంద్ర అగర్వాల్‌ను పూణే క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నిస్తోంది. By srinivas 23 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Porsche crashed: పూణెలోని కళ్యాణి నగర్‌లో ఆదివారం లగ్జరీ పోర్షే కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు అనీష్ అవడియా, అశ్విని కోస్టా.. క్లబ్‌లో పార్టీ చేసుకుని స్నేహితులతో కలిసి మోటార్‌సైకిళ్లపై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ విశాల్ అగర్వాల్ 17 ఏళ్ల మైనర్ కుమారుడు ఈ కారు డ్రైవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించగా.. అతని తండ్రి కేవలం 15 గంటల్లోనే బెయిల్ ఇప్పించారు. అయితే పూణే కోర్టు అతనికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసింది. అయితే తాజా విచారణలో కారు ప్రమాదం జరిగినపుడు తన డ్రైవర్ ఉన్నాడని నిందితుడి తండ్రి పేర్కొన్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినప్పుడు తాను కారు నడుపుతున్నానని డ్రైవర్ తన మొదటి ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో విశాల్ అగర్వాల్ మొబైల్ ఫోన్ రికవరీ చేసుకుని ప్రమాద వివరాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి 17 ఏళ్ల బాలుడి తాత సురేంద్ర అగర్వాల్‌ను కూడా పూణే క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నిస్తోంది. బెయిల్ ఇచ్చే సమయంలో న్యాయమూర్తి ఆ యువకుడికి షరతులు విధించారు. ఎరవాడ ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పనిచేయాలి. ప్రమాదాలపై వ్యాసం రాయాలి. మద్యం సేవించకుండా ఉండేందుకు చికిత్స, కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచించిది. #pune #luxury-porsche-car మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి