పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్ట్ వీక్ చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టాయి. దీంతో ఒక్క రోజే 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు.

New Update
పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్ట్ వీక్ చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలను చేపట్టాయి. దీంతో ఒక్క రోజే 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు. వీరందరినీ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.

ఈ మేరకు గతవారం జరిగిన భద్రతా లోపంపై విపక్షాలు బలంగా గొంతు వినిపిస్తున్నాయి. రాజ్యసభ, లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సభ నియమాలు ఉల్లంఘించి, సభా కార్యకలాపాలకు అడ్డుకోవడంతోపాటు క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు. లోక్‭సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీల సస్పెండ్ కాగా.. గత గురువారం 13 మంది లోక్‭సభ నుంచి, రాజ్యసభ నుంచి ఒక ఎంపీ సస్పెండ్ అయ్యారు. దీంతో ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

ఇది కూడా చదవండి  : పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్‌.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు వీళ్లే

లోక్‌సభలో అధిర్ రంజన్ చౌదరితో పాటు సు.తిరునావుక్కరసర్, విజయ్ బసంత్, ప్రతిమ మండల్, కాకోలి ఘోష్, కే.మురళీధరన్, సునీల్ కుమార్ మండల్, ఎస్.రామ లింగం, కే.సురేష్, అమర్ సింగ్, రాజ్మోహన్ ఉన్నితన్, గౌరవ్ గొగోయ్, టీఆర్.బాలు, కే.జై కుమార్, అపూర్వ పొద్దార్, ప్రసూన్ బెనర్జీ, మహమ్మద్ వాసిర్, జీ.సెల్వం, సీఎన్ అన్నాదురై, డాక్టర్ టీ.సుమతి, కే.నవాస్కాని, కే.వీరాస్వామి, ఎన్‌కే.ప్రేమచంద్రన్, సౌగత రాయ్, శతాబ్ది రాయ్, అసిత్ కుమార్ మల్, ఎన్టు ఆంటోనీ, ఎస్.ఎస్.పళనామ్నిక్కం, అబ్దుల్ ఖలీద్ లు సస్పెండ్ అయ్యారు.

ఇక రాజ్యసభ నుంచి రణదీప్ సూర్జేవాలా, రజనీ పాటిల్, ఎం.సంగమ్, అమీ యాగ్నిక్, ఫూలో దేవి నేతమ్, సమీరుల్ ఇస్లాం, కనిమొళి, ఫయాజ్ అహ్మద్, అజిత్ కుమార్, నానారాయణ్ భాయ్ జెత్వా, రంజిత్ రంజన్, మౌసమ్ నూర్ లపై సస్పెండ్ వేయిట్ పడింది. ఇక గతంలో రాజీవ్ గాంధీ హయాంలో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ రికార్డును తిరగరాస్తూ మోదీ హయాంలో ఏకంగా 92 మంది ఓకేసారి సస్పెండ్ కావడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు