Kadapa : ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు!

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలను స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లి విధులకు ఆటంకం కలిగించారంటూ వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. రాచమల్లు, మునిరెడ్డిపై 353 ,506తో పాటు మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదైంది.

New Update
Kadapa : ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు!

Proddatur : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Siva Prasad Reddy) కి పోలీసులు షాక్ ఇచ్చారు. వైసీపీ (YCP) కార్యకర్తలను స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లి విధులకు ఆటంకం కలిగించారంటూ వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు రాచమల్లుతో పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై 353 ,506తో మరికొన్ని సెక్షన్ల కింద కేసు కేసు నమోదు చేశారు.

publive-image

ఇది కూడా చదవండి: Raisi: ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు.. జాడ కోల్పోయిన హెలికాప్టర్‌!?

ఈ మేరకు ప్రొద్దుటూరు (Proddutur) వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రాచమల్లుతో పాటు బావమరిది బంగారు మునిరెడ్డిపైనా కేసు ఫైల్ చేశారు. తనను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ శ్రీకాంత్ (CI Srikanth) ఫిర్యాదు చేయగా కొందరు వైసీపీ కార్యకర్తలను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలను స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లారని, విధులకు ఆటంకం కలిగించి, బెదిరింపులకు పాల్పడ్డందుకు 353 ,506 తోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు