Gadwal : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించింది ప్రియాంక అనే విద్యార్ధిని. కష్టపడి చదివితే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది. ఇదంతా పెళ్ళయ్యాక కూడా సాధించింది.

New Update
Gadwal : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

Three Government Jobs : ఏదైనా సాధించాలనుకుంటే.. పట్టుదల ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఏ పరిస్థితులూ అడ్డురావు. అమ్మనాన్నలతో ఉన్నా, పెళ్ళయినా కూడా చదువుకునే వారిని ఎవ్వరూ ఆపలేరు. దీనికి చక్కని ఉదాహరణ జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) గట్టు మండలం తప్పేట్లమొర్సు గ్రామానికి చెందిన వి.ప్రియాంక(V. Priyanka). ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తానేంటో నిరూపించింది. మొదటిసారిగా వనపర్తి జిల్లా కోర్టుకు ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి ఎంపికైంది. తర్వాత రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం సాధించింది. ఇక మూడో సారి ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరుగా ఎంపికైంది.

Also Read : Movies : హమ్మయ్య బతికిపోయాం..రష్మిక పోస్ట్

తల్లిదండ్రులు, భర్త సహకారం...

ప్రస్తుతం ప్రియాంక వనపర్తి జిల్లా కోర్టు(Vanaparthy District Court) లో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుంది. కష్టపడి చదివితే సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఓపికతో కష్టపడి చదివితే దేనినైనా సాధించవచ్చు అని చెబుతున్నారు ప్రియాంక. నేను మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి నాకు ఎంతగానో సహకారం అందించిన మా అమ్మ నాన్నకు.. ఇంకా నా భర్తకు కృతజ్ఞతలు అంటున్నారు. వాళ్ళ సహకారం లేకపోతే తాను ఇన్ని సాధించేదాన్ని కాదని చెబుతున్నారు. ఆడపిల్లలను(Women Child's) చదివిస్తే ఏమి లాభం అని అనుకునే ఈ రోజుల్లో మా నాన్న నామీద నమ్మకం ఉంచి ఎంఎస్ సి బీఈడి వరకు చదివిపించారు. పెళ్ళయిన తర్వాత నా భర్త కూడా మానాన్న లానే ఆలోచించారు. నా భర్త నాకు గురుకుల కోచింగ్ ఇప్పించి సపోర్ట్ చేశారు అంటూ ఆనందంగా చెబుతున్నారు ప్రియాంక.

అభినందనల వెల్లువ..

ప్రియాంక సాధించిన దానికి వారి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బతబ్బిబ్బు అవుతున్నారు. వారి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రియాంకను అభినందించడానికి బంధువుల, స్థానికులు తరలివస్తున్నారు. ఆమెను శాలువాలతో కప్పి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్వీట్లలో ముంచెత్తుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు