Expensive wedding: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి, వెడ్డింగ్ డ్రెస్ ధరెంతో తెలుసా!?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ప్రిన్సెస్ డయానా- ప్రిన్స్ చార్లెస్‌ల వెడ్డింగ్ నిలిచిపోయింది. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లికి రూ. 400 కోట్లు ఖర్చు కాగా.. యువరాణి డయానా వెడ్డింగ్‌కు రూ. 914 కోట్లు ఖర్చు చేశారు. డయానా పెళ్లి దుస్తులు కూడా ఖరీదైనవిగానే నిలిచిపోయాయి.

New Update
Expensive wedding:  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి, వెడ్డింగ్ డ్రెస్ ధరెంతో తెలుసా!?

Princess Diana: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ గా ప్రచారంలో ఉంది. అంతేకాదు పెళ్లిలో చాలా ఖరీదైన రూ. 4.1 కోట్ల దుస్తులు ధరించిన వధువుగా ఇషా అంబాని పేరు చెప్పుకుంటారు. కానీ నిజానికి ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాస్ట్ లీ మ్యారేజ్. వరల్డ్ రిచెస్ట్ మ్యారేజ్ గా ఇప్పటివరకూ ప్రిన్సెస్ డయానా- ప్రిన్స్ చార్లెస్‌ల వివాహం చరిత్రలో నిలిచిపోయింది. ఇషా అంబానీ -ఆనంద్ పిరమల్ పెళ్లికి రూ. 400 కోట్లు ఖర్చు కాగా.. యువరాణి డయానా వెడ్డింగ్‌కు రూ. 914 కోట్లు ఖర్చు చేశారు. డయానా ధరించిన దుస్తుల ఖరీదు రూ.96 లక్షలుండగా ఇషా అంబానీ డ్రెస్ ధర రూ.83 లక్షలు.

publive-image

అలాగే డయానా-చార్లెస్‌ల వివాహం బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ చరిత్రలో అత్యధికంగా వీక్షణలు పొందిన ఈవెంట్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. మొత్తం 28.4 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వేడుకను తిలకించారు. ఇక యువరాణి డయానా వివాహ దుస్తులు కూడా అన్ని జనరేషన్ లలో ఇప్పటివరకూ అత్యంత ప్రసిద్ధమైనదిగా పరిగణించబడుతున్నాయి. ఈ జంట వారి నిశ్చితార్థం, వివాహానికి కలిసి మొత్తం 3 వేలకు పైగా బహుమతులు పొందారు.

publive-image

ఇందులో ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, అరుదైన గడియారాలు, విలాసవంతమైన పాత్రలున్నాయి. వేడుకలో 250 మంది సంగీతకారులు ప్రత్యక్ష సంగీతాన్ని ప్రదర్శించారు. 1400 మంది ముఖ్య అతిథులు హాజరయ్యారు. కానీ అట్టహాసంగా జరిగిన పెళ్లి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. చార్లెస్, డయానాలు కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు. చివరికి యువరాణి డయానా కారు ప్రమాదంలో మరణించారు.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

New Update
Air India flight 123

Air India flight 123

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment