/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/modi-1.png)
Modi : చెన్నై(Chennai) లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఖేలో ఇండియా(Khelo India) యూత్ గేమ్స్ ను ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) కూడా హాజరయ్యారు. స్టాలిన్ ప్రధాని మోడీతో కలిసి మాట్లాడారు. ఈ క్రమంలో మోడీ , స్టాలిన్, ఉదయనిధి ముగ్గురు కూడా స్టేడియం వైపు నడుకుంటూ వెళ్తున్నారు.
అదుపు తప్పిన స్టాలిన్.....
ఆ సమయంలో స్టాలిన్ బ్యాలెన్స్ కోల్పోయారు. ఆ టైం లో పక్కనే ఉన్న మోడీ స్టాలిన్ చేతిని పట్టుకున్నారు. ఆ తరువాత కూడా మోడీ స్టాలిన్ చేతిని వదలకుండా పట్టుకునే స్టేజీ వద్దకు తీసుకుని వెళ్లారు. మోడీ స్టాలిన్ ను వేదిక మీదకు తీసుకుని వెళ్తున్న క్రమంలో వారి వెనుకే ఉదయనిధి ఉన్నారు.
PM Modi just saved Stalin from slipping away 🙌 pic.twitter.com/WL5y4yCMNa
— Rishi Bagree (@rishibagree) January 19, 2024
స్టాలిన్ చేతిని పట్టుకుని..
మోడీ స్టాలిన్ చేతిని పట్టుకుని తీసుకుని వెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రారంభించిన తరువాత మోడీ మాట్లాడుతూ... వచ్చే ఒలింపిక్ క్రీడల(Olympic Games) కు భారత్(India) అతిధ్యం ఇవ్వాలని తెలిపారు. క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపును అందించడంతో పాటు భారతదేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ కు కేంద్రంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని మోడీ అన్నారు.
ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడు(Tamil Nadu) ను దేశ క్రీడా రాజధానిగా మార్చడమే డీఎంకే ముఖ్య లక్ష్యమని అన్నారు. శనివారం కూడా మోడీ తమిళనాడులో పర్యటించనున్నారు.
Also read: అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..యోగిని చంపేస్తాం: ఖలిస్తానీ వాదుల హెచ్చరిక!