PM Modi: అర్ధరాత్రి వారణాసి వీధుల్లో తిరిగిన మోడీ.. పోస్ట్ వైరల్! యూపీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం అర్ధరాత్రి వారణాసి వీధుల్లో సందడి చేశారు. ఇటీవలే నిర్మించిన శివ్‌పుర్- ఫుల్‌వరియా - లహ్‌రతారా మార్గ్‌ను పరిశీలించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 23 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Uttar Pradesh: భారత ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే గురువారం అర్ధరాత్రి తన సొంత నియోజకవర్గం వారణాసి (Varanasi) చేరుకున్నారు. అయితే మోడీ వారణాసిలో అడుగుపెట్టగానే అక్కడ ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఇటీవలే నిర్మించిన శివ్‌పుర్- ఫుల్‌వరియా - లహ్‌రతారా మార్గ్‌ను పరిశీలించారు. ఆయన వెంటే యూపీ సీఎం యోగి (CM Yogi) ఆదిత్యనాథ్ కూడా ఉండగా.. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by BJP - Bharatiya Janata Party (@bjp4india) వారణాసి వీధుల్లో రోడ్‌షో.. ఈ మేరకు రూ.360కోట్లతో నిర్మించిన ఈ మార్గ్‌ను ఇటీవలే ప్రారంభించిన ప్రధాని.. ఈ నిర్మాణంతో సౌత్ వారణాసి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గినట్లు తెలిపారు. అలాగే ఈ రహదారి మార్గంలోనే బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఇప్పుడు చాలా సులభంగా ఉంటుందని, గతంలోకంటే సగం టైమ్ సేఫ్ అవుతుందన్నారు. ఇక ఈ మార్గ్ కు సంబంధించి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలావుంటే.. ఈ మార్గాన్ని పరిశీలించే ముందు మోడీ వారణాసి వీధుల్లో రోడ్‌షోలో పాల్గొన్నారు. అయితే అప్పటికే అర్ధరాత్రి దాటినా మోడీని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. రహదారుల వెంట బారులు తీరిన జనాలు ఆయనపై పూలవర్షం కురిపించారు. View this post on Instagram A post shared by BJP - Bharatiya Janata Party (@bjp4india) ఇది కూడా చదవండి: Ashwin : స్పిన్ చాణక్యుడి ఖాతాలో అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా ఘనత! రెండు రాష్ట్రాల్లో పర్యటన.. ఇక ఈ పర్యటనలో భాగంగా మొత్తంగా మోడీ రెండు రాష్ట్రాల్లో రూ. 60,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లోని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలను పెంపొందించి, ఆ పరిసరా ప్రాంతాల్లో పురోగతిని సాధించడమే లక్ష్యంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. #inspected #prime-minister-modi #varanasi #new-projects మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి