Delhi Services Bill : నాలుగు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..!

ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Dropuadi Murmu)ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీలో ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో ఆ బిల్లు చట్టంగా మారనుంది. ఈ బిల్లుతో పాటు మరో మూడు కీలక బిల్లులకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

New Update
Delhi Services Bill : నాలుగు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..!

Delhi Services Bill: ఢిల్లీ సర్వీసెస్ బిల్లు కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Dropuadi Murmu)ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీలో ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ (Parliament) ఆమోదం తెలిపింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో ఆ బిల్లు చట్టంగా మారనుంది. ఈ బిల్లుతో పాటు మరో మూడు కీలక బిల్లులకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో అధికారులపై నియంత్రణ అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెట్టేలా ఢిల్లీ కేంద్ర రాజధాని ప్రాంత ప్రభుత్వం (సవరణ) బిల్లు-2023ను కేంద్రం ఇటీవల రూపొందించింది. ఈ బిల్లును ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి మద్దతును కూడగట్టింది.

ఈ బిల్లును ఆగస్టు 1న కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశ పెట్టారు. విపక్షాల ఆందోళనల నడుమ ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. అనంతరం అగస్టు7న ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. దీనిపై ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, బిల్లకు వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లుకు ఆమోదం లభించింది.

ఆ బిల్లుతో పాటు మరో మూడు బిల్లులకు రాష్టప్రతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆ బిల్లుల్లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్(సవరణ) బిల్లు, జన విశ్వాస్( సవరణ) బిల్లలు వున్నాయి. ఈ క్రమంలో ఈ మూడు బిల్లులు కూడా చట్టాలుగా మారనున్నాయి.

Also Read: రైతుల కోసం మరో అద్భుత పథకం.. సగం ధరకే ట్రాక్టర్లు అందజేత

Advertisment
Advertisment
తాజా కథనాలు