Criminal Laws: అమల్లోకి మూడు క్రిమినల్‌ చట్టాలు... బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం!

మూడు క్రిమినల్ చట్ట సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 21, డిసెంబర్ 20న ఈ చట్టాలకు రాజ్యసభ, లోక్‌సభలో ఆమోదం లభించింది.

New Update
Criminal Laws: అమల్లోకి మూడు క్రిమినల్‌ చట్టాలు... బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం!

బ్రిటీష్ కాలం నాటి న్యాయ చట్టాలకు కాలం చెల్లింది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చేశాయి. దీనికి సంబంధించి 3 కొత్త క్రిమినల్ చట్టాల బిల్లులకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా వీటికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇండియన్ పీనల్ కోడ్ - ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ - సీఆర్‌పీసీ, సాక్ష్యాల చట్టం - ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టం పేరుతో కేంద్రం ఈ చట్టాలను రూపొందించింది.

డిసెంబర్ 21న రాజ్యసభ ఈ బిల్లులకు ఆమోదం తెలపగా.. డిసెంబర్ 20న వాటిని లోక్‌సభ ఆమోదించింది. కొత్త సవరించిన చట్టాల ప్రకారం 'నేరం జరిగిన 30 రోజులలోపు వారి నేరాన్ని అంగీకరించినట్లయితే.. అప్పుడు శిక్ష తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త చట్టాల ప్రకారం, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి గడువు నిర్ణయించబడింది. విచారణ నివేదికను జిల్లా మేజిస్ట్రేట్‌కు సమర్పించిన తర్వాత, దానిని 24 గంటల్లోగా కోర్టు ముందు సమర్పించాలి. మెడికల్ రిపోర్టును నేరుగా పోలీసు స్టేషన్/కోర్టుకు ఏడు రోజుల్లో పంపాలనే నిబంధన ఉంది. చార్జిషీట్ ఇకపై 180 రోజుల తర్వాత పెండింగ్‌లో ఉంచబడదు. అలాగే ఇప్పుడు నిందితులకు నిర్దోషిగా ప్రకటించడానికి ఏడు రోజుల సమయం ఉంటుందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఒక న్యాయమూర్తి ఆ ఏడు రోజుల్లో విచారణ జరపాలి. గరిష్టంగా 120 రోజులలో కేసు విచారణకు వస్తుంది. ముందుగా (ప్లీజ్) బేరసారాలకు ఇందులో కాలపరిమితి లేదని స్పష్టం చేశారు.

ఇక ట్రయల్స్ సమయంలో పత్రాలను సమర్పించడానికి ఎలాంటి నిబంధన లేదు. మేము 30 రోజులలోపు అన్ని పత్రాలను సమర్పించడాన్ని తప్పనిసరి చేశాం. ఇందులో ఎలాంటి జాప్యం జరగదని షా తెలిపారు. అంతేకాకుండా నిందితుడు 90 రోజుల్లోగా కోర్టుకు హాజరుకాకపోతే, అతడు/ఆమె గైర్హాజరీలో విచారణ కొనసాగుతుందని షా చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం నియమించిన న్యాయవాదులు వ్యక్తికి బెయిల్ పొందుతారు. లేదా అతనికి/ఆమె మరణశిక్ష విధించబడుతుందన్నారు. నిందితులను ఇతర దేశాల నుంచి దేశానికి తీసుకురావడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు.

Also Read: షాకింగ్‌ న్యూస్‌.. పూంచ్‌లో పౌరుల మరణాల వెనుక ఆర్మీ బ్రిగేడియర్?

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment