డార్లింగ్‌తో, రాఖీ భాయ్.. ఫ్యాన్స్‌కి పూనకాలే! రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో సలార్ మూవీ ఒకటి. ఈ మూవీపై స్టార్టింగ్ నుంచే మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. అంతేకాదు.. డార్లింగ్‌తో పాటు రాఖీభాయ్ యాక్ట్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ మూవీపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ మూవీ ఫ్రెండ్సిఫ్ గురించి మెయిన్‌గా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. By Shareef Pasha 21 Jun 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో తన తదుపరి మూవీ సలార్ ఒకటి. కెజిఎఫ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. విలన్స్ గా జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, ఎప్పటినుంచో ఈ సినిమాపై ఒక స్ట్రాంగ్ బజ్ ఉంది. ప్రశాంత్ నీల్ యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నాడని.. సలార్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సలార్ మూవీలో కెజీఎఫ్ రాఖీ భాయ్ తాజాగా సలార్ మూవీలో కెజిఎఫ్ రాఖీ భాయ్ నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో సలార్, రాఖీ భాయ్ ఫ్రెండ్స్ అంటూ, ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ న్యూస్ నిజమేనని తెలుస్తుంది. కెజిఎఫ్ 2 చివర్లో .. రాఖీ భాయ్ బంగారం మొత్తం తీసుకొని సముద్రంలోకి దూకేస్తాడు. అయితే ఆ సముద్రంలోకి దూకే ముందు అతని ఫ్రెండ్ అయిన సలార్ ను కలిసి మాఫియా మొత్తాన్ని అంతం చేయమని చెప్తాడట. దీంతో ఫ్రెండ్ కోరిక మేరకు ప్రభాస్ .. రంగంలోకి దిగి మాఫియాను అంతం చేయనున్నాడట. కొంతమంది ఇదే సలార్ కథ అని చెప్పుకొస్తున్నారు. ఇందులో ప్రభాస్ విలన్స్ కూడా యాడ్ అవుతారట. అయితే సినిమాలో రాఖీ భాయ్ కూడా కనిపించనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ తో మాట్లాడినట్లు వాయిస్ ను వినిపించనున్నారని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 28న, ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి