Prasanth Varma : రన్ వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? డైరెక్టర్ టీమ్ ఏం చెప్పిందంటే..

ప్రశాంత్ వర్మ – రణ్ వీర్ సింగ్ ప్రాజెక్ట్ ఆగోపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ హనుమాన్ జయంతి రోజునే ఈ మూవీ షూటింగ్ స్టార్ చేసినట్లు తెలిపింది.

New Update
Prasanth Varma : రన్ వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? డైరెక్టర్ టీమ్ ఏం చెప్పిందంటే..

Prasanth Varma Team Gives Clarity About Brahma Rakshasa : టాలీవుడ్ (Tollywood) యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ‘హనుమాన్’ (Hanu-Man) మూవీతో పాన్ ఐడియా లెవెల్లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఇతని ఫిల్మ్ మేకింగ్ కి నార్త్ వాళ్ళు ఫిదా అయిపోయారు. ‘హనుమాన్’ చూసిన కొందరు బాలీవుడ్ స్టార్స్ ఎలాగైనా ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల ఈ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.

ఈ సినిమాకి టైటిల్ ని కూడా లాక్ చేసినట్లు తెలిసింది. ప్రశాంత్ వర్మ – రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి ‘బ్రహ్మ రాక్షస’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారని, పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని తెరకెక్కించనున్నారని, అన్ని భాషల్లో ఇదే టైటిల్ ని లాక్ చేసినట్లు ఇటీవలే న్యూస్ వచ్చింది.

Also Read : ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ దేవగన్ ‘మైదాన్’.. కానీ ఓ ట్విస్ట్?

కానీ ఏమైందో తెలీదు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ ఆగోపోయినట్లు వార్తలు ఊపందుకున్నాయి. డైరెక్టర్ కి హీరోకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు ఫిలిం సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

అందులో ఎలాంటి నిజం లేదు

రన్ వీర్ సింగ్ తో ప్రాజెక్ట్ ఆగిపోయిందని వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ హనుమాన్ జయంతి రోజునే ఈ మూవీ షూటింగ్ స్టార్ చేసినట్లు తెలిపింది. అంతేకాదు ఇప్పటికే మూవీకి సంబంధించి రణవీర్ పై కొన్ని సీన్లు కూడా షూట్ చేసిన‌ట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని స్వయంగా ప్రశాంత్ వర్మ టీమ్ ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడినట్లయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు