Tirumala : తిరుమల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియోలు.. విచారణకు ఆదేశించిన టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు. దీంతో ఈ విషయం గురించి టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. By Bhavana 12 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Prank Video : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ (TTD) ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు. తమిళనాడు (Tamilnadu) కు చెందిన టీటీఎఫ్ వాసన్ అనే యువకుడు తన మిత్రులతో కలిసి శ్రీవారి దర్శనానికి రెండు రోజుల క్రితం వచ్చాడు. ఈ క్రమంలో క్యూలైన్‌లోని నారాయణగిరి షెడ్స్ కంపార్ట్ మెంట్లో భక్తులు దర్శనానికి వేచివున్నారు. ఆ కంపార్ట్ మెంట్ తాళాలు తీస్తున్నట్లు హడావిడి చేస్తూ వాసన్ తన స్నేహితులతో కలిసి ఫ్రాంక్ వీడియో తీశాడు. అయితే అతను అలా చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న భక్తులు... వీరిని టీటీడీ సిబ్బంది అనుకున్నారు.. తాళాలు తీస్తున్నారేమోనని అటు వైపు వెళ్లడానికి సిద్దమయ్యారు. కానీ వాసన్, అతని స్నేహితులు వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి పరుగు తీశారు. చూస్తే అది ఫ్రాంక్ వీడియో. ఈ వీడియోని వారు ఇన్‌స్టాగ్రాం (Instagram) లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాంక్ వీడియో తీసిన యువకుడి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది. Also read: తల్లిదండ్రులు, అత్తామామలతో గడిపేందుకు వారికి సెలవులు! #viral-video #ttd #instagram #prank-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి