Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు... రిటైర్డ్ ఐపీఎస్ తో పాటు, ఓ మీడియా ఛానెల్ అధినేత కూడా! తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారిగా భావిస్తోన్న రిటైర్డ్ ఐపీఎస్, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఓ మీడియా సంస్థ యజమాని పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. By Bhavana 23 Mar 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Raids on Retd IPS Prabhakar Rao: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సూత్రధారిగా భావిస్తోన్న రిటైర్డ్ ఐపీఎస్, స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రభాకర్ రావు ఇప్పటికే దేశం దాటి పోయినట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెండ్ అయ్యాడో అప్పుడే ఈయన పరారైనట్లు సమాచారం. ఈ కేసులో ఓ మీడియా సంస్థ యజమాని పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రణీత్ రావు ఎస్‌ఐబీ లో ఉన్న సమయంలో సేకరించిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా వీరిద్దరికీ ఇచ్చేవాడని అధికారులు గుర్తించారు. మీడియా కార్యాలయంలోనే సర్వర్ ను ఉంచి, ప్రణీత్ రావు ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు అధికారుల దర్యాప్తులో తెలిసింది. ఇప్పుడు ఆ మీడియా యజమాని ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. ట్యాపింగ్ కు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా యజమాని కూడా లండన్ కు పారిపోయినట్లు సమాచారం. ఆధారాలను బట్టి నిందితులను జైలుకు పంపే అవకాశాలున్నాయి. ఇప్పటికే పోలీసులు ప్రణీత్ రావును ఏడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ప్రణీత్ రావును విచారించింది. ఇప్పటికే ఈ కేసుని వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.ఈ క్రమంలోనే శనివారంతో ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ ముగుస్తుంది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి వాటి ముక్కలను మూసీ నదిలో పడేసినట్లు విచారణలో తేలింది. మరోసారి ప్రణీత్ రావుకు వైద్య పరీక్షలు చేసి సాయంత్రానికి తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. శనివారం ప్రణీత్‌రావుకు పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్యాపింగ్ కుట్రలో భాగస్వాములైన వారిలో ఎంతమందిని రిమాండ్‌కు తరలిస్తారు..? వారిలో తిరిగి ఎంతమందిని కస్టడీకి తీసుకుంటారు..? అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రణీత్‌రావు హార్డ్ డిస్క్‌ల ధ్వంసం అనంతరం వాటి ముక్కలను మూసీ నదిలో పడేసినట్లు విచారణలో తేలింది. అవి ఏ ప్రాంతంలో పడేశారనేది శనివారం నిర్ధారించే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు విచారణ పూర్తి చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. Also Read: మాస్కో ఉగ్ర ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని మోదీ! #telangana #dsp #praneeth-rao #phone-tapping-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి