Tirupathi: తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు.. ప్రహ్లాద్ ను చంపింది గంజాయి మత్తే! తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్ మరణానికి గంజాయి మత్తే కారణమని పోలీసులు తెలిపారు. సింహాం దగ్గరకు వెళ్లేముందు ప్రహ్లాద్ గంజాయి సేవించినట్లు విచారణలో వెల్లడించారు. By srinivas 19 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Tirupati Zoo Park Incident: తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. మద్యం మత్తులోనే ప్రహ్లాద్ (Prahlad) సింహానికి బలైనట్లు వార్తలొస్తుండగా తాజాగా పోలీసులు సంచలన నిజాలు బయటపెట్టారు. సింహాం దగ్గరకు వెళ్లేముందు ప్రహ్లాద్ గంజాయి సేవించినట్లు గుర్తించారు. అంతేకాదు ప్రహ్లాద్ మానసిక స్థితి బాగోలేదని గుర్తించినట్లు వెల్లడించారు. గంజాయి మత్తులోనే ఆలయ సిబ్బందిపై దాడి.. ఈ మేరకు రాజస్థాన్‌కు చెందిన 38 ఏళ్ల ప్రహ్లాద్ గుర్జర్ మరణానికి ముందు ప్రవర్తన తీరు గురించి పోలీసులు, శ్రీ వేంకటేశ్వర జూ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రహ్లాద్ గంజాయి మత్తులోనే వేణుగోపాలస్వామి ఆలయ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలిపారు. టికెట్ విషయంలో కౌంటర్ దగ్గరున్న వ్యక్తితోనూ గొడవపెట్టుకున్నపుడు కూడా గంజాయి మత్తులోనే ఉన్నాడని, హాథీరాంజీ మఠం సిబ్బంది డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగానే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే ప్రహ్లాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేక ఒంటరిగా తిరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలోనే కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ప్రహ్లాద్‌ను తిరుపతిలో (Tirupati) వదిలి వెళ్లినట్లు పోలీసులు వివరించారు. ఇది కూడా చదవండి: AP: పార్టీ మారిన 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? సిబ్బంది చెప్పినా వినకుండా.. ఇదే క్రమంలో మరుసటి రోజు ఎస్వీ జూకు వెళ్లిన ప్రహ్లాద్ గంజాయి మత్తులోనే ఉన్నాడని, అదే మైకంలో సింహం ఎన్‌క్లైజర్‌లోకి ప్రవేశించినట్లు చెప్పారు. గుర్జర్ గురువారమే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో సిబ్బంది చెప్పినా వినకుండా సింహాల ఎన్‌క్లోజర్ వైపు వెళ్లాడు. తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. కొంత దూరంలోని వాటర్‌ట్యాంక్ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అంతటితో ఆగకుండా వంద మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. జూలో మూడు సింహాలుండగా దుంగాపూర్ అనే సింహం తన వైపు చూడగానే తొడగొట్టి రెచ్చగొట్టాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించగా అతనివైపు వేగంగా పరిగెత్తుకొచ్చింది. దీంతో ప్రహ్లాద్ భయంతో ఉలిక్కిపడి పక్కనే ఉన్న చెట్టెక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్ గుర్జర్ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం తీసుకెళ్లి హతమార్చిందని వివరించారు. #ganja #prahlad-died #tirupati-zoo-incident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి