NEET: సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే నీట్-యూజీ పరీక్ష తుది ఫలితాలు మరో రెండురోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. By B Aravind 23 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే నీట్ పరీక్ష తుది ఫలితాలు మరో రెండురోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. సుప్రీం కోర్టు చేసిన పరిశీలనల ప్రకారం పరీక్ష మెరిట్ జాబితాను సవరిస్తామని తెలిపారు. నీట్ అంశంపై విపక్షాలు అరాచకం, అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపణలు చేశారు. Also Read: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. ఆ 6గురు ఎమ్మెల్యేలు జంప్? ఇదిలాఉండగా.. నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తేల్చిచెప్పింది. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హుజారీబాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని పేర్కొంది. పేపర్ లీక్ వల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని చెప్పింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీకవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) పలువురిని అరెస్టు చేసింది. అయితే పేపర్ లీక్ కావడంతో.. మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మళ్లీ పరీక్ష నిర్వహిస్తే తాము నష్టపోతామని.. పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని కొందరు విద్యార్థులు కూడా పిటిషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. చివరికి నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని సంచలన తీర్పునిచ్చింది. Also Read: మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం.. ధరల హెచ్చుతగ్గుల వివరాలివే! #neet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి